బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రూలర్’. హీరోగా బాలయ్యకు ఇది 105వ చిత్రం. ‘జై సింహా’ తర్వాత  కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోసారి బాలకృష్ణ..ఔట్ అండ్ ఔట్ మాస్ ఓరియంటెట్ మూవీతో ఆడియన్స్‌ను పలకరించబోతున్నాడు. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటించారు. భూమిక ముఖ్యపాత్రలో నటించింది. ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి డ్యూయల్‌ రోల్లో నటించినట్టు సమాచారం. బాలయ్య గత రెండు చిత్రాలు ఎన్టీఆర్ బయోపిక్ నిరాశ పరచడంతో ‘రూలర్’ చిత్రంపై భారీ ఆశలే పెట్టుకున్నారు ఆయ‌న ఫ్యాన్స్‌.  ఈ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుని  సెన్సార్ వాళ్ళు దీనికి U/A సర్టిఫికేట్ జారీ చేసారు. ఈ నెల 20న ఈ సినిమా విడుదల కానుంది.

 

ఇక రేపు విడుద‌ల కానున్న ఈ సినిమాకి పెద్ద‌గా థియేట‌ర్స్ దొర‌క‌లేద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే విడుద‌ల‌మైన వెంకీమామ చిత్రం చాలా థియేట‌ర్ల‌లో ఆడుతుంది. అంతే కాక రేపు చాలా సినిమాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌డంతో బాల‌య్య‌కు థియేట‌ర్లు దొర‌క‌లేదు. ఓ ప‌క్క సాయిధ‌ర‌మ్‌తేజ్ హీరోగా న‌టించిన ప్ర‌తిరోజూపండ‌గే చిత్రం గీతాఆర్ట్స్‌లో అల్లుఅర‌వింద్ రిలీజ్ చేస్తుండ‌గా, మ‌రో ప‌క్క బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ న‌టించిన ద‌బాంగ్‌3ని సురేష్‌ప్రొడ‌క్ష‌న్స్ విడుద‌ల చేస్తున్నారు.  అలాగే కార్తి హీరోగా న‌టించిన దొంగ చిత్రం రావూరి వి. శ్రీ‌నివాస్ విడుద‌ల చేస్తున్నారు.  మ‌రి వీటికి మ‌ల్టీప్లెక్స్‌ల‌న్నీ బుక్ అయిపోయాయి. ఇక బాల‌య్య‌కు మ‌ల్టీప్లెక్స్‌లో స్థానం లేన‌ట్టే. మ‌రి బాల‌య్య‌కు కేవ‌లం కొన్ని బీ, సీ సెంట‌ర్ల‌లో మాత్ర‌మే థియేట‌ర్లు ఉన్నాయి.

 

ప్ర‌తి రోజుకు అల్లు అర‌వింద్ థియేట‌ర్లు, సురేష్‌బాబు థియేట‌ర్లు వెంకీ మామ‌తో పాటు, ద‌బాంగ్ 3 కూడా ఆయ‌నే ఇచ్చాడు.. ఈ విధంగా  బాల‌య్య సినిమాకు థియేట‌ర్ల దెబ్బ ప‌డింద‌నే చెప్పాలి.  థియేట‌ర్లే లేవు అనుకుంటే అడ్వాన్స్ బుకింగ్ లు కూడా నిల్ చాలా డ‌ల్ అన్న‌ట్లు ఉన్నాయి. బాల‌య్య సినిమా కేవ‌లం ఆయ‌న ఫ్యాన్స్ వ‌ర‌కేనా అన్న‌ట్లు ఉంది. రూల‌ర్‌తో పాటు మూడు క్రేజీ సినిమాలు రావ‌డంతో బాల‌య్య ప‌రిస్థితి ఎలా ఉంటుందో మ‌రి రేపు వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: