తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో నితిన్ ఒకరు. హీరోగా జయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నితిన్ తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే నితిన్‌కి హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది. కెరీర్ ఆరంభంలోనే మంచి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదే జోరును కొన్నేళ్ల పాటు చూపించిన నితిన్ ఇటీవల.. హిట్ వచ్చి చాలా కాలం అయ్యింది. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే మూడేళ్లు దాటింది. ఎన్నో ఆశలతో చేసిన 'లై ' సినిమా వేరే సినిమాలతో పోటీ పడి నలిగిపోయింది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కలిసి ప్రొడ్యూస్ చేసిన ఛల్ మోహన్ రంగ కూడా షాక్ ఇచ్చింది.
సర్లే అని దిల్ రాజు జడ్జిమెంట్‌ని నమ్ముకుని చేసిన శ్రీనివాసకల్యాణం సినిమా కూడా ఫేల్ అయింది. ఇదిలా ఉంటే.. ఇండస్ట్రీకి వచ్చిన 17 ఏళ్లు అవుతున్నా ఈ యంగ్ హీరో పెళ్లి ఊసే ఎత్తటం లేదు. ఇక 36 ఏళ్ళ నితిన్ పెళ్లికి సంబంధించి ఇటీవల పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. నితిన్ ప్రేమ వివాహం చేసుకోనున్నాడని, డెస్టినేషన్ వెడ్డింగ్ వేడుకగా నితిన్ వివాహం ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది నిజయే అన్నట్టు తెలుస్తోంది. దుబాయ్‌లోని ప్యాలసో వెర్సేస్ హోటల్లో వీరి వివాహం జరగనుందట. ఇదిలా ఉంటే.. శ్రీనివాస కల్యాణం తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న నితిన్ ఒకేసారి మూడు సినిమాలకు ఓకే చెప్పేశాడు.
అయితే సినిమాలకు నితిన్ గుడ్ బై చెప్పనున్నారు. ప్రస్తుతం ఏప్రిల్ మొదటి వారానికి తన చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తిచేయాలని ఫిక్స్ అయ్యాడు నితిన్. భీష్మ సినిమాను ఇప్పటికే పూర్తిచేశాడు. మరోవైపు వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్న రంగే దే సినిమాను శరవేగంగా పూర్తిచేస్తున్నాడు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చేస్తున్న చదరంగం అనే సినిమాపై మాత్రం కాస్త అనుమానాలున్నాయి. పెళ్లి తర్వాత కనీసం 3 నెలలు గ్యాప్ తీసుకోవాలని భావిస్తున్నాడు ఈ హీరో. అంటే పూర్తిగా గుడ్ బై చెప్పడం కాదండోయ్.. కేవలం ఓ మూడు నెలలు మాత్రమే ఈయన సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారు.