టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా పై టాలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల విదేశాల్లో జరిగిన ఈ సినిమా షూటింగ్, అతి త్వరలో ముంబై లో తాజా షెడ్యూల్ జరుపుకోనున్నట్లు టాక్. కొద్దిరోజుల క్రితం రామ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ కొట్టి, మళ్ళి ఫామ్ లోకి వచ్చిన పూరి, నటి ఛార్మి తో కలిసి తన పూరి కనెక్ట్స్ బ్యానర్ ఫై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ముందుగా ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్ ప్రచారం అయినప్పటికీ, సినిమా అసలు టైటిల్ అది కాదని కూడా వార్తలు వచ్చాయి. విజయ్ ఒక పవర్ఫుల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో ఒక స్టార్ హీరోయిన్ నటిస్తున్నట్లు టాక్. 

 

ఇక ఈ సినిమాలోని తన క్యారెక్టర్ కోసం ఇటీవల పలు యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకున్న విజయ్, సినిమా కోసం ఎంతో బాగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా పాన్ ఇండియా ఫీల్ తో భారీ రేంజ్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాతో అటు పూరి, ఇటు విజయ్ మరింత గొప్ప ఇమేజ్ సొంతం చేసుకుంటారని అంటున్నారు. అయితే ఈ సినిమా విషయమై నేడు ఒక ఆసక్తికరమైన వార్త పలు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతోంది. అదేమిటంటే, ఈ సినిమాలో ఎక్కువగా ఫైట్స్, మాస్ యాక్షన్ వంటి అంశాలు ఉంటాయని, అలానే హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని రొమాంటిక్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్తున్నారు. 

 

అయితే ప్రేక్షకులను ఆకట్టుకునే ఆసక్తికరమైన కథ మాత్రం ఈ సినిమాలో లేదని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై కొంత భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరేమో ప్రచారం అవుతున్న వార్త నిజమే అయితే సినిమా పెద్దగా అడదని అంటుంటే, మరికొందరు మాత్రం అవన్నీ ఒట్టి పుకార్లే అని, ఎందుకంటే గతంలో పూరి తీసిన సినిమాలు గమనిస్తే ఎక్కువగా అవి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా సాగడం గమనించవచ్చని, ఆ విధముగానే మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతుననట్లు చెప్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజా నిజాలు ఉన్నాయో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు ఓపిక పట్టాల్సిందే...!! 

మరింత సమాచారం తెలుసుకోండి: