బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక మన తెలుగులో ఉన్నటువంటి టాప్ టెలివిజన్ ఛానెల్స్ లో ఒక్కొక్కటి ఒక్కో క్యాటగిరీ లో అదరగొడుతుంటాయి. వాస్తవానికి ఇప్పుడంటే షోలు విపరీతంగా పాపులర్ అయ్యాయి కానీ టెలివిజన్ ఛానెల్ అంటే ఒకప్పుడు మొదటగా గుర్తుకు వచ్చేది సంవత్సరాల పాటు సాగే సీరియల్స్ గుర్తుకు వస్తాయి. అలాగే గతంలో సీరియల్స్ అంటే ఆడవాళ్లు మాత్రమే చూసేవాళ్లు. కానీ, ఇప్పుడు మగవాళ్లు కూడా చూసేలా చేస్తున్నాయి. ఇక ఏదైనా తమకు ఇష్టమైన సీరియల్ వచ్చిందంటే చాలు.. చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా టీవీకి అతుక్కుపోతుంటారు కొందరు.
ప్రేక్షకులను నవ్విస్తూ.. కవ్విస్తూ.. ఏడిపిస్తూ.. వచ్చే సీరియల్స్ బుల్లితెరపై చాలానే ఉన్నాయి. స్టార్ మాటివి ఈ వారం అధిక పాయింట్లతో నంబర్ వన్ పొజిషన్లో ఉంది. అయితే స్టార్ మాటివికి ఓ రేంజ్ లో రేటింగ్ రావడానికి కారణం సీరియల్స్. ఈ చానల్ లోని సీరియల్స్ కి ఎవరూ ఊహించని రేటింగ్ వస్తోంది. ఇక ఎప్పటిలాగానే ఈ వారం కూడా కార్తీక దీపం సీరియల్ టాప్ రేటింగ్ సీరియల్‌గా నిలిచింది. అయితే సెకెండ్ ప్లేస్‌లో మాత్రం కొత్తగా వచ్చిన ఇంటింటి గృహ లక్ష్మి ఉండడం విశేషం. ఈ వారం రేటింగ్స్ బట్టీ చూస్తే.. ఈ సీరయల్ కార్తీక దీపం సీరియల్‌కే గట్టి పోటీ ఇస్తోంది.
ఇక ఈ వారం రేటింగ్స్‌కు గానూ కార్తీక దీపం 13 పాయింట్లకు పైగా దక్కించుకోగా.. ఇంటింటి గృహ లక్ష్మి 10 పాయింట్లకు పైగా దక్కించుకోవడం విశేషం. వాస్తవానికి కార్తీక దీపం తర్వాత తెలుగు నాట అత్యధికంగా చూస్తున్న మరో సీరియల్ వదినమ్మ. ఈ సీరియల్ కూడా మంచి ట్విస్టులతో నడుస్తోంది. అయితే ఇంటింటి గృహ లక్ష్మి మాత్రం వదినమ్మ సీరియల్‌ను బీట్ చేసి.. కార్తీక దీపం సీరియల్‌ను కూడా తొక్కేయాలని చూస్తోంది. సరిగ్గా కార్తీక దీపం సీరియల్ తర్వాతే కావడం అందులోను సరికొత్త సీరియల్ కావడం దీనికి మరింత ప్లస్ అవుతుందని బ్రాడ్ కాస్టింగ్ వర్గాలు అంటున్నాయి. మరి ముందు ముందు ఇదే రేటింగ్స్ కొనసాగిస్తుందా.. లేదా.. అన్నది చూడాలి.