జనాల అంచనాలు అందుకున్నోళ్లు స్టార్ డైరెక్టర్లు అవుతారు. వాళ్ల అంచనాలను మించి అవుట్ పుట్ ఇచ్చినోళ్లు రాజమౌళిలా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా నిలుస్తారు. ఇప్పుడీ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ట్రిపుల్ ఆర్ ని ఇలాగే ఎవ్వరి అంచనాలకు అందకుండా.. విజువల్ ఫీస్ట్ లా రెడీ చేస్తున్నాడట. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కు 6నెలలకు పైగా టైమ్ కేటాయిస్తున్నాడు జక్కన్న. 

 

రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాను వాయిదా వెయ్యగానే తెలుగు సినీజనాలు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. నందమూరి, కొణిదెల హీరోలు కలిసి నటిస్తోన్న ఈ సినిమా చూడ్డానికి మరికొన్ని రోజులు వెయిట్ చెయ్యాలా అని నిరాశపడ్డారు. అయితే రాజమౌళి ఇంత టైమ్ తీసుకుంది ఓ అద్భుతం సృష్టించడానికే అంటున్నాయి యూనిట్ వర్గాలు. 

 

అడవి బిడ్డల తరఫున పోరాడిన అల్లూరి  సీతారామరాజు, కొమురం భీం పాత్రల నేపథ్యంలో రూపొందుతోంది ట్రిపుల్ ఆర్. 1920ల కాలం నాటి కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో భారీ సెట్లు, విజువల్ ఎఫెక్ట్స్ కు చాలా ప్రాధాన్యత ఉంది. నాటి పరిస్థితులను రీ క్రియేట్ చేసేందుకు సీజీ వర్క్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాడు రాజమౌళి.

 

గ్రాఫికల్ వర్క్స్ ఎక్కువగా ఉంది కాబట్టే ఈ జూలై 30న రిలీజ్ చేయాల్సిన ట్రిపుల్ ని వచ్చే ఏడాది జనవరి 8కి తీసుకెళ్లాడు రాజమౌళి. అయితే వాయిదాతో పెరిగిన ఈ 7నెలల మొత్తాన్ని గ్రాఫికల్ వర్క్స్ కే కేటాయిస్తున్నాడట జక్కన్న. సమ్మర్ కల్లా షూటింగ్ పూర్తి చేసి, ఇక ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పైనే కూర్చుంటాడని చెబుతున్నారు. బాహుబలి రికార్డ్స్ ని, ఆ స్టాండర్స్ ని బ్రేక్ చేయడం ఇప్పట్లో సాధ్యం కాదని చాలామంది స్టేట్ మెంట్స్ ఇచ్చారు. అయితే సొంత రికార్డులను బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకునే రాజన్న, ట్రిపుల్ ఆర్ తో ఈ బాహుబలి రికార్డ్స్ ని బ్రేక్ చేయాలనుకుంటున్నాడు. 

 

బాహుబలి భారీ గ్రాఫికల్ వండర్ గా ప్రేక్షకులను ఫిదా చేసింది. టెక్నికల్ గా ఓ బెంచ్ మార్క్ సెట్ చేసింది. పీరియాడికల్ డ్రామాలంటే బాహుబలి రేంజ్ లో ఉండాలనే స్టేజ్ ను సెట్ చేసింది. అయితే ఈ స్టాండర్స్ ని తర్వాతి లెవల్ కు తీసుకెళ్లడానికి ట్రిపుల్ ఆర్ ని దించుతున్నాడు రాజమౌళి. జూనియర్ ఎన్టీఆర్ మే నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతున్నాడు. అంటే ఏప్రిల్ కల్లా ట్రిపుల్ ఆర్ టాకీ పార్ట్ పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. సో సమ్మర్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. సో వీఎఫ్ ఎక్స్ స్టూడియోలు దాదాపుగా 9నెలలు గ్రాఫిక్స్ పనులు చేసే అవకాశముంది. 

 

ట్రిపుల్ ఆర్ కోసం 9 నెలల పాటు వీఎఫ్ఎక్స్ స్టూడియోలు పనిచేస్తే.. అవుట్ పుట్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. గ్రాఫిక్స్ లో ఖచ్చితంగా బాహుబలిని మించిపోతుందనే స్టేట్ మెంట్స్ వినిపిస్తున్నాయి. మరి రాజమౌళి ఇంత టైమ్ కేటాయించిన ట్రిపుల్ ఆర్ ఆడియన్స్ కు ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ఇస్తుందో చూడాలి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: