కన్నడ భామ రష్మిక మందన్న టైం బాగా నడుస్తుందని చెప్పొచ్చు. ఈ ఇయర్ ఆల్రెడీ సరిలేరు నీకెవ్వరు సినిమాతో హిట్ అందుకున్న ఈ అమ్మడు రీసెంట్ గా వచ్చిన భీష్మ సినిమాతో కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాలతో హిట్ కొట్టి ఆడియెన్స్ ను అలరిస్తున్న ఈ అమ్మడు మరోపక్క ఫోటో షూట్స్ తో ఇంకాస్త క్రేజ్ తెచ్చుకుంటుంది. మాములుగా హీరోయిన్స్ తమ స్కిన్ షోతో ఫోటో షూట్స్ చేస్తారు కాని రష్మిక మాత్రం డిఫరెంట్ గా తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఫోటో షూట్ చేస్తుంది. 

 

హిట్టు కొట్టావు కదా అది సరిపోదు అన్నట్టు మళ్లీ ఇలా ఫోటో షూట్స్ తో కూడా ఆడియెన్స్ ను డిస్ట్రబ్ చేయాలా అంటూ రష్మిక మీద కామెంట్స్ చేస్తున్నారు ఆడియెన్స్. మహేష్, నితిన్ ఇద్దరు హీరోలతో సినిమాలు చేసిన రష్మిక ఈ ఇయర్ లో సుకుమార్, బన్ని సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తుంది. ఇక త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కాంబో మూవీలో కూడా రష్మికనే తీసుకోవాలని చూస్తున్నరట. కన్నడ భామే అయినా తెలుగులో రష్మిక ఫుల్ ఫామ్ లో ఉంది.

 

రాబోయే రెండు సినిమాలు కూడా క్రేజీ ప్రాజెక్ట్ లు అవడంతో ఆ రెండు సినిమాల్లో ఏది హిట్ అయినా టాలీవుడ్ నంబర్ 1 రేసులో రష్మిక ముందున్నట్టే అవుతుంది. ప్రస్తుతం పూజా హెగ్దే, రష్మిక ఈ ఇద్దరి మధ్య గట్టి పోటీ ఏర్పడింది. స్టార్ సినిమా అంటే అయితే రష్మిక లేదంటే పూజా హెగ్దే హీరోయిన్స్ అవుతున్నారు. పూజా హెగ్దే కూడా ప్రభాస్ జాన్ తో పాటుగా మరో రెండు ప్రాజెక్టులకు సైన్ చేసింది. స్టార్ సినిమా అంటే వీళ్లిద్దరికే ముందు ఛాన్స్ వీళ్ళకు కుదరదని చెబితేనే వేరే హీరోయిన్ కు ఛాన్స్ వెళ్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: