సినీ సెలబ్రిటీలు అన్న తర్వాత సోషల్ మీడియాలో ఫాలోయింగ్ భారీగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ ఫాలోయింగ్ ని కొంతమంది కేటుగాళ్లు ఆసరాగా తీసుకుంటారు. హీరోల పేరుతో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి ఆ అకౌంట్ ద్వారా... అమ్మాయిలను ట్రాప్ చేయడం... లేదా ఇంకా ఏదైనా నేరాలకు పాల్పడుతూ ఉండటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి కూడా. ఇక తాజాగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. తన పేరుమీద నకిలీ ఫేస్బుక్ అకౌంట్ తెరిచి అమ్మాయిలకు వలవేస్తున్న యువకుడిని గుర్తించిన విజయ్ దేవరకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. 

 

 

 విజయ్ దేవరకొండ ఫిర్యాదు మేరకు కేసు నమోదు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే... విజయ్ దేవరకొండకి టాలీవుడ్ లో చాలా క్రేజ్ ఉంటుంది అనే విషయం తెలిసిందే. మామూలుగా అయితే తన అభిమానులతో అప్పుడప్పుడు చాట్ చేయడానికి తమ సినిమా అప్డేట్స్ పోస్ట్ చేయడానికి ఎక్కువగా సోషల్ మీడియాను వాడుతూ ఉంటారు సెలబ్రిటీలు . ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండకు ఉన్న ఫాలోయింగ్ ని ఆసరాగా చేసుకొని అమ్మాయిలకు లవ్ ట్రాప్ చేయాలని ... విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ఖాతా పేరుతో ఒక  ఖాతాను తెరిచి... అమ్మాయిలకు రిక్వెస్ట్ లు పంపేయడం అందమైన అమ్మాయిలను ఎంచుకుని వారితో నేరుగా చాటింగ్ చేస్తూ ఉండటం ఆ తర్వాత లోబర్చుకునేందుకు ప్రయత్నించడం లాంటివి చేస్తున్నాడు. 

 

 

 ఇక మాయమాటలు చెప్పి యువతుల పర్సనల్ ఫోన్ నెంబర్లు తీసుకుని ఆ తర్వాత వాట్సప్ చాటింగ్ చేస్తూ రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దామని... సహజీవనం చేద్దాము అంటూ ఆ యువకుడు వేధించడం మొదలుపెట్టాడు. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటివరకు బాధిత యువతులు ఎవరు బయటకు రానప్పటికీ... ఇటీవలే ఈ విషయాన్ని కొంతమంది విజయ్ దేవరకొండ దృష్టికి తీసుకెళ్లడంతో దీనిపై స్పందించిన విజయ్ దేవరకొండ.. వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే గోవింద అనే వ్యక్తితో హేమ పేరుతో  ఫేస్బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టించి  చాటింగ్ చేయించాడు. ఇక ఆ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసీ  విజయ్ దేవరకొండ డబ్బింగ్ ఆర్టిస్టును  మాయమాటలు చెప్పి వివరాలు సేకరించేందుకు ప్రయత్నించాడు.దీంతో  విజయ్ దేవరకొండ అధికారులను పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. కాగా ప్రస్తుతం నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: