ఇప్పటి సినిమాల్లో అమ్మ నాన్న పాత్రల్లో ఎవరు నటిస్తే బాగుంటుంది అనుకుంటే టక్కున గుర్తొచ్చే జంట ప్రకాష్ రాజ్-జయసుధ.... వీరిరువురు  సూపర్ హిట్ కాంబినేషన్ అన్నమాట... ఇద్దరు కలిసి సినిమాలో నటిస్తే సూపర్ హిట్  అన్నమాట...అన్నమాట ఏంటి ఇది ఉన్నమాటే... అభిమానులు కూడా వీళ్ళ పైర్ కి మార్కులు వేస్తారు కూడా.. ఈ జంట ఎన్నో సినిమాల్లో నటించారు... బొమ్మరిల్లు సినిమాలో వీళ్ళ నటనకి ప్రేక్షకులు సైతం బ్రహ్మ రధం పట్టారు.. తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్, తల్లి పాత్రలో జయసుధ జీవించేసారు.

 

 

ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో  ముందుకు వచ్చారు.. పెద్దోడా... చిన్నోడా అంటూ వెంకటేష్ ని మహేష్ బాబుని పిలిచే పిలుపు వింటే అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడినట్లు ఉంటుంది.. సినిమా చూస్తున్నంత సేపు సినిమాలా అసలు అనిపించదు... నిజంగానే తల్లి కొడుకు, తండ్రి పిల్లలు, భార్య భర్త లా అనిపిస్తారు... పాత్రలో ఇద్దరు జీవించేస్తారు... గోవిందుడు అందరివాడేలే సినిమాలో తాత -మామ్మలా నటించి అందరిని మెప్పించారు.. ఇలాంటి పాత్రలు కూడా చేస్తారా అని అనిపించారు.. పాత్ర ఏదన్నా అవ్వనివ్వండి దానిలో ఒదిగిపోయి నటిస్తారు... అమ్మ నాన్న తమిళమ్మాయి, శతమానం భవతి, మహర్షి, బొమ్మరిల్లు, గోవిందుడు అందరివాడేలే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, కొత్త బంగారు లోకం ఇలా ఎన్నో చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించి మెప్పించారు.

 

 

ప్రకాష్ రాజ్ అండ్ జయసుధ సినిమాలో నటిస్తున్నారంటే సినిమా హిట్ అవ్వడం పక్కా అని అందరి అభిప్రాయం. తల్లి తండ్రి పాత్ర అంటే ముందుగా ఎవరికన్నా గుర్తొచ్చే జంట వీరే... నటనలో ఎవరి నటన వారిది.. ప్రకాష్ రాజ్ ఏ పాత్ర లో అయిన ఇట్టే ఒదిగిపోతారు... పాత్రలో లీనం అయ్యి ఆ పాత్రకి న్యాయం చేస్తారు.. జయసుధ ఏమన్నా తక్కువా ఏంటి పాత్రలో అడుగుపెట్టాక  జీవించేస్తుంది....తెరపై వీళ్ళని చూస్తే నిజంగా భార్య భర్త లా అనుకునే విధంగా ఉంటారు... ఆల్ టైమ్ ఫేవరెట్ పైర్.... వీరికి సరిరారు వేరెవ్వరు...

మరింత సమాచారం తెలుసుకోండి: