నాచురల్ స్టార్ నాని సుధీర్ బాబు ప్రధాన పాత్రలో  మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం వి. ఈ సినిమాపై అటు తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే  ఇప్పుడు వరకు నాచురల్ స్టార్ నాని ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి మంచి విజయాలను అందుకున్నారు. తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించాడు. కానీ మొదటిసారి 'వి' సినిమాలో నాచురల్ స్టార్ నాని విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ కి మంచి స్పందన వచ్చింది. ఇక ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తవ్వగా విడుదలకు సంబంధించి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాలో సుధీర్ బాబు పోలీస్ పాత్రలో కూడా కనిపించనున్నారు. 

 


 మామూలుగానే సుధీర్ బాబు ఎలాంటి పాత్ర ఇచ్చిన ఇరగదీస్తాడు అన్న విషయం తెలుసిందే. మరో వైపు నాచురల్ స్టార్ నాని కూడా సరికొత్తగా మొదటిసారి విలన్ పాత్రలో నటించబోతున్నారు. దీంతో ఈ సినిమాపై మరింత హైప్ పెరిగిపోయింది. ఇక ఈ సినిమా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో  తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నివేదాథామస్,  అతిథి రావ్ లు  కథానాయికలుగా కనిపించనున్నారు. అయితే  ఈ సినిమాను ఉగాది సందర్భంగా ఈనెల 25వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకుంది చిత్రబృందం . కానీ ప్రస్తుతం ఈ సినిమాపై కరోనా  వైరస్ ఎఫెక్ట్ పడినట్లు తెలుస్తోంది. అయితే ప్రపంచ దేశాలను ఇప్పుడు కరోనా  వైరస్ భయపెడుతుంది. ఇప్పటికే ప్రాణాంతకమైన కరోనా  వైరస్ కారణంగా వివిధ భాషల్లోని సినిమా షూటింగులు... విడుదల తేదీలు కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి. ముఖ్యంగా కేరళలో అయితే సినిమా థియేటర్లన్నీ పూర్తిస్థాయిలో మూసివేశారు. 

 

 సినిమా థియేటర్లకు ఎక్కువగా సినిమా చూడడానికి ప్రేక్షకులు ఎక్కువగా వస్తారు కాబట్టి కరోనా  ప్రబలే అవకాశం ఉన్నందున... సినిమా థియేటర్ల అన్నింటినీ మూసివేశారు. దీంతో ఇటు టాలీవుడ్ పెద్దలు కూడా ఆలోచనలో పడ్డట్లు  తెలుస్తోంది. అటు యుఎస్లో కూడా కరోనా  గురించి వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఇదే సమయంలో ఇంటర్ విద్యార్థులతోపాటు పదవ తరగతి విద్యార్థులకు కూడా పరీక్షలు ఉన్నాయి. ఈ సమయంలో 'వి' సినిమా విడుదల చేస్తే నష్టం వాటిల్లే అవకాశం ఉందని అందుకే విడుదల తేదీ వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ఈ విషయంలో దిల్ రాజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: