తెలుగులో ఏడు అడుగుల ఎత్తున్న హీరో ఎవరు? అని ఎవరిని అడిగినా.. ఠక్కున వచ్చే సమాధానం.. రానా దగ్గుబాటి అని. మొదటి చిత్రం లీడర్ తోనే ఆయన తెలుగు సినీ ప్రపంచంలో ఒక లీడర్ అనిపించుకున్నారు. అటు నటుడిగాను, ఇటు కొత్తవారిని ప్రోత్సహిస్తాడన్న మంచి హీరో గాను రానాకి ఇండస్ట్రీలో చాలా మంచి పేరు వుంది. అలాగే మొదటి నుండి చాలా వైవిద్య భరితమైన సినిమాలు చేస్తూ, తనకంటూ ఒక మార్క్ సంపాదించుకున్నాడు. 

 

ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో, దర్శక దిగ్గజం రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ అని అందరికి తెలిసినదే. ఇక ఎవరికి తెలియనిది ఏమంటే, తాజాగా లవ్ స్టోరీ స్పెషలిస్ట్ 'తేజ' ఆర్ఆర్ఆర్ టైటిల్‌తోనే ఓ సరిక్రొత్త చిత్రం తీయబోతున్నాడు. దానిపేరు అందరూ వినే వుంటారు... అదే ఆర్ఆర్ఆర్ అంటే "రాక్ష‌స రాజ్యంలో రావ‌ణాసురుడు" అన్న మాట! తేజ కూడా ఈ rrr ను వర్కింగ్ టైటిల్ గా వాడుకోబోతున్నాడని టాలీవుడ్ సమాచారం. 

 

బల్లాల దేవ రానా ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న ఈ చిత్రం అతి త్వ‌ర‌లోనే సెట్స్ పైకి తేజ తీసుకెళ్ళబోతున్నాడట! ఇందులో రానా పాత్ర, ప్రతి నాయకుడి ఛాయలు పాత్రను పోలి ఉంటుందని వినికిడి.  ఇందులో ఒక హీరోయిన్ గా కాజ‌ల్ అగ‌ర్వాల్ కాగా, మిగిలిన కాస్ట్ అండ్ క్రూ వివరాలు ఇంకా తెలియాల్సి వుంది. ఈ విషయమై తేజ త్వరలోనే అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి మిగిలిన విషయాలను చెప్పబోతున్నాడట..

 

ఇక రానా ప్ర‌స్తుతం అర‌ణ్య అనే సినిమాతో పాటు విరాట‌ప‌ర్వం అనే చిత్రాలు పూర్తి చేసే పనిలో బిజీగా వున్నాడు. ఇక rrr వర్కింగ్ టైటిల్ పెట్టడం వలన మూవీ పైన మంచి హైప్ తీసుకు రావచ్చనే తేజ డైరెక్షన్ టీమ్ ఐడియాను తేజ తూ.చ పాటించబోతున్నాడని వినికిడి. కొంత కాలం గ్యాప్ తరువాత తేజ చాలా స్ట్రిక్ట్ గా తన స్క్రిప్ట్ ను కంపోజ్ చేసాడని... ఈ మూవీతో తేజ టాలీవుడ్లో పెను సంచలనాలకు దారి తీస్తాడని పలువురు సినీ ప్రముఖుల విశ్లేషణ...!

మరింత సమాచారం తెలుసుకోండి: