పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ప్రస్తుతం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హిట్ మూవీ తెలుగు రీమేక్ వకీల్ సాబ్  రీమేక్లో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు... బాలీవుడ్ బడా నిర్మాత బోనీ కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల అయిన విషయం తెలిసిందే. వకిల్ సాబ్  సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి ఎంతో ఆదరణ వచ్చింది. ఇక అటు అభిమానులు కూడా ఎంతో మురిసి పోయారు. హిందీ పింక్  మూవీ లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను తెలుగులో పవన్ కళ్యాణ్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మొదటి సారి లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు.. 

 

 

 ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా వకీల్ సాబ్  ఈ సినిమాకు సంబంధించిన హీరోయిన్ ఎవరు అనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది.  మొదట లేడీ సూపర్ స్టార్ నయనతారను ఈ సినిమాలో పవన్ సరసన నటించేందుకు సెలెక్ట్ చేసారు అని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే వకీల్ సాబ్ లో పవన్ తో  పాటు నటిస్తుంది అని  కొన్ని వార్తలు హల్ చల్ చేశాయి. ఇక పూజ హెగ్డే కాదు నయనతార కాదు... ఇప్పటికే పవన్ కళ్యాణ్ సరసన రెండు సినిమాల్లో నటించి మంచి జోడిగా  పేరు తెచ్చుకున్న శృతి హాసన్ పవన్ వకీల్ సాబ్  సినిమాలో నటించబోతుందని అంటూ పుకార్లు షికార్లు చేశాయి. ఇక తాజాగా మరో  ఇద్దరి పేర్లు కూడా పవన్ కళ్యాణ్ సినిమాలో  నటించబోతున్నారు అంటూ తెర మీదికి వచ్చాయి. 

 

 

 పవన్ కళ్యాణ్ సరసన ఇలియానా లేదా లావణ్యత్రిపాఠి లు నటించబోతున్నారు అని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా లావణ్య త్రిపాఠి కే ఎక్కువగా పవన్ కల్యాణ్ సినిమాలో నటించే అవకాశం ఉంది అంటూ చర్చ జరుగుతోంది.  తెలుగు చిత్ర పరిశ్రమలో తన అందం అభినయంతో ఇప్పటికే ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న లావణ్య త్రిపాటి... గతంలో సీనియర్ హీరో నాగార్జున సరసన నటించిన విషయం తెలిసిందే. సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జున సరసన నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన కూడా లావణ్య త్రిపాటి నటించే అవకాశాలు ఉన్నాయి అంటు వార్తలు వస్తున్నాయి. ఈచిత్రంలో ఇప్పటికే నివేదా థామస్, అంజలిఅనన్య లు  కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: