నా ప్రార్ధన మీకు కొంచెం కొత్తగా అనిపించొచ్చు.... భయపడడం లోనే పడడం ఉంది మనం పడొద్దు లేగుద్దాము, ఆశ కాన్సర్ ఉన్నవాడిని కూడా బ్రతికిస్తుంది భయం అల్సర్ ఉన్నవాడిని కూడా చంపేస్తుంది, నీకే తల నొప్పి తెస్తున్నాడంటే వాడెవడో అమృతాంజన్ కు అమ్మ  మొగుడై  ఉంటాడు. ఇలా అనేక సూపర్  డైలాగ్స్ ని అందించాడు మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అయన మాటలు అద్భుతం అనేక సినిమాలలో చక్కని డైలాగ్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు మన త్రివిక్రమ్ శ్రీనివాస్.

 

IHG

 

 

పదునైన సంభాషణకు త్రివిక్రమ్ శ్రీనివాస్ పెట్టింది పేరు. అతని కలం నుండి వెండి తెరపై అనేక సంభాషలని కురిపించాడు. అయితే వాటిలో ఎన్నో తారా స్థాయి కి చేరుకోవడం విశేషం. 1999 సంవత్సరం నుండి కూడా త్రివిక్రమ్ ఈ చిత్ర పరిశ్రమలో పని చేస్తూ వచ్చాడు. మాటల రచయితగా, స్క్రీన్ రచయితగా, దర్శకుడిగా, వాణిజ్య ప్రకటన దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత గానో ప్రసిద్ధి చెందారు.

 

 

సూపర్ స్టార్ మహేష్ బాబు తో త్రివిక్రమ్ శ్రీనివాస్ అతడు సినిమా రూపొందించారు. అలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో జులాయి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది వంటి సినిమాలని తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు త్రివిక్రమ్. అయితే బన్నీ తో త్రివిక్రమ్ జులాయి మాత్రమే కాకుండా సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠ పురములో సినిమాలని కూడా చేసారు.

 

IHG

 

 

విలువలతో కూడిన కధలు ఈయన దర్శకత్వం లో కనిపిస్తాయి. అయితే జులాయి డైలాగ్స్ బాగా ఫేమస్ అయ్యాయి. అల వైకుంఠ పురం అయితే మంచి భారీ హిట్ అందుకుంది. సన్నాఫ్ సత్యమూర్తి కూడా బాగా ఆకట్టుకుంది. ఇలా త్రివిక్రమ్ సినిమాలు బన్నీకి మంచి పేరు తెచ్చాయనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: