ప్రస్తుతం అన్ని భాషల సినీ ఇండస్ట్రీలు ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికిప్పుడు సినిమా గురించి చిన్న విషయం తెలిసిన కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయంగా మారుతుంది. ఆ విషయాన్ని భారతదేశంలో ఉన్న అన్ని సినిమా వర్గాల మొత్తం వారు చదువుతున్నారంటే నమ్మండి. సినిమా విడుదల కోసం అయితే ప్రేక్షక అభిమానులు చాలా ఎదురుచూపులు చూస్తున్నారు. నిజానికి ఈ సినిమాని మొదటగా ఈ సంవత్సరం జూలై చివర్లో విడుదల చేస్తామని తెలుపగా .. కానీ అది కాస్త దసరా తర్వాత విడుదల చేస్తామని ప్రకటించారు చిత్రయూనిట్ సభ్యులు.

 


కానీ కొన్ని షూటింగ్ పనులు వాయిదా ఉండడంతో వచ్చే సంవత్సరం జనవరి 8, 2020 కి వాయిదా వేయడం జరిగింది. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో సినిమా షూటింగ్ పూర్తిగా నిలిపి వేయడం జరిగింది. మళ్లీ తిరిగి షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారు కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి అన్ని పూర్తి అవుతే వచ్చే సంవత్సరం వేసవి సెలవుల్లో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మళ్లీ ఇప్పటిలో షూటింగ్ మొదలు పెట్టే అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. నిజానికి ఈ సినిమా భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది.

 


కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకొని షూటింగులు పూర్తి చేయాలి. ఇప్పటికే 80% వరకు షూటింగ్ ముగిసిన కొన్ని పనులు మాత్రం వాయిదా పడుతూనే వస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని కీలక సన్నివేశాలు చేయవలసి ఉండడంతో ఇంకాస్త పడుతుందని అనిపిస్తుంది. ప్రస్తుతానికి ఏ రోజున విడుదల చేస్తామని తెలియకపోయినా ఈ సినిమాను మాత్రం 2021 సంవత్సరం మే నెల  రెండో వారంలో విడుదల చేస్తున్నట్లు తెలుగు ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా రాజమౌళి సినిమా వస్తుంది అంటే అది రిలీజ్ డేట్ ని మార్చడం కామన్ గా మారింది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా మల్టీ స్టారర్ సినిమా కావడంతో అటు రామ్ చరణ్ ఫాన్స్, ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: