ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్  విజృంబిస్తున్న విషయం తెలిసిందే. కరోనా  వైరస్ ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్  విధించింది. దేశంలోని ప్రజలందరూ ఇంటి నుంచి కాలు బయట పెట్టకుండా కరోనా వైరస్పై పోరాటం చేసి వైరస్ ను తరిమి కొట్టాలంటూ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ప్రజలందరూ ఇంటికే పరిమితమయ్యారు. రోడ్లమీద కనీసం ప్రజలు కనిపించడం లేదు. ఇదిలా ఉంటే కాస్త డబ్బున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కటిక పేదరికం లో కొట్టుమిట్టాడుతున్న వారు మాత్రం కనీసం తినడానికి తిండి లేక అల్లాడుతున్నారు. ఆ  రోజు పనికి వెళ్తే కానీ నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్ళలేని నిరుపేదలు ప్రస్తుతం తిండిలేక అలమటిస్తున్నారు. 

 

 

 ఈ క్రమంలోనే చాలా మంది ప్రముఖులు లాక్ డౌన్ సమయంలో నిరుపేదలను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. కరోనా వైరస్  నేపథ్యంలో తిండి సంపాదించి బతకడం కోసం యుద్ధం చేస్తున్నా చాలా మంది నిరుపేదలకు అండగా నిలిచేందుకు చాలామంది సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన పెద్ద మనసును చాటుకుంది. తమ కుటుంబం తరఫున లాక్ డౌన్  సమయంలో ఇబ్బంది పెడుతున్న నిరుపేదలకు చేయూత  అందించాలని నిర్ణయించింది రకుల్ ప్రీత్ సింగ్. ఇక అనుకున్నదే తడవుగా గురుగ్రమ్ లోని  స్లమ్ ఏరియాలో ఉంటున్నా 250 కుటుంబాలను దత్తత తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. 

 

 

 రకుల్ ప్రీత్ సింగ్ నాన్న పర్యవేక్షణలో 250 పేద కుటుంబాలకు రెండు పూటలా పౌష్టిక ఆహారాన్ని అందిస్తుంది . అంతే కాకుండా వ్యక్తిగత పరిశుభ్రత సామాజిక దూరం పాటించాలి అని సూచిస్తుంది రకుల్ ప్రీత్  సింగ్ . ప్రజలంతా ఇళ్ళల్లో ఉండి  సురక్షితంగా ఉండాలని... పేద వారికి తమ వంతు సహాయం ఎప్పుడూ ఉంటుంది అంటూ రకుల్ ప్రీత్ పేదలకు ధీమా ఇస్తుంది . ఒక్క పూట  తిండి కోసం కష్టపడుతున్న నిరుపేదలకు ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ ఇచ్చిన చేయూతతో వారి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. దీంతో రకుల్ ప్రీత్ సింగ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: