ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఎంతో కష్టపడాలి..అభిమానులను అలరించి వారి అభిమానులను సంపాదించుకున్న హీరోలు చాలా మందే ఉన్నారు.. ఇకపోతే సినిమాల ద్వారా పలు ఇండస్ట్రీలలో ఫేమస్ అయినా వారు అతికొద్ది మందే ఉన్నారు.. వారిలో తమిళ నటుడు సూర్య కూడా ఒకరు..ఎన్నో సినిమాలలో నటించి మెప్పించారు..

 

 

 

తెలుగులో కూడా చాలా సినిమాలలో నటించి యాంగ్రీ మెన్ గా పేరు సంపాదించుకున్నారు..ఇకపోతే ఈ మధ్య సూర్య నటించిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమాలు లేవు .. అయితే సూర్యా వరుస సినిమాల లో నటిస్తూ వస్తున్నాడు. తెలుగు తమిళ్ లో సూర్యకు మంచి పేరు సంపాదించిన సినిమాలు. చాలానే ఉన్నాయి.. 

 

 

 

 

తమిళ నటుడు సూర్య అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. తెలుగు , తమిళ్ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ప్రస్తుతం సూర్య ఆకాశం నీ హద్దురా .. సినిమాలో నటిస్తున్నారు.. లాక్ డౌన్ కారణంగా ఆ సినిమా షూటింగ్ వాయిదా పడింది.. ఎయిర్‌డెక్కన్‌ వ్యవస్థాపకుడు ఆర్‌.గోపీనాథ్‌ జీవితకథను సినిమా తెరకెక్కిస్తున్నారు. 

 

 

 

 

 

ఈ నేథ్యంలో సినిమాపై ఆసక్తి పెంచాలని చిత్రయూనిట్ ఒక వీడియో ను షేర్ చేసింది .. 44ఏళ్ల వయసు ఉన్న సూర్య 19 ఏళ్ల యువకుడు ఎలా మారాడు అనేది అందులో చూపించారు..దర్శకురాలు సుధా కొంగరా చెప్పిన పాత్ర కోసం సూర్య ఎలాంటి కసరత్తులు చేశారు. ఎలాంటి డైట్‌ పాటించారన్న విషయాలను అందులో చూపించారు.అపర్ణా బాల మురళి కథానాయికగా నటిస్తున్నారు..ఈ చిత్రంలో మోహన్‌బాబు, జాకీ ష్రాఫ్‌, పరేశ్‌రావల్‌, సంపత్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీవి ప్రకాశ్‌కుమార్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: