టాలీవుడ్‌లో నిన్న‌టి త‌రం టాప్ హీరోయిన్ సిమ్రాన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. శ్రీకాంత్ మా నాన్న‌కు పెళ్లి సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన సిమ్రాన్ ఆ త‌ర్వాత ఆమె ఇటు తెలుగు తో పాటు అటు త‌మిళ్ లో స్టార్ హీరోల ప‌క్క‌న వ‌రుస పెట్టి సినిమాలు చేసి ఓ వెలుగు వెలిగింది. సిమ్రాన్ బాల‌య్య‌తో స‌మ‌ర‌సింహా రెడ్డి, న‌ర‌సింహా నాయుడు లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సినిమాల్లో న‌టించింది. ఇటు వెంక‌టేష్ కు క‌లిసుందాం రా, నాగార్జున‌కు నువ్వు వ‌స్తావ‌ని లాంటి సూప‌ర్ హిట్లు ఇచ్చింది. చిరంజీవితో సిమ్రాన్ డాడీ, మృగ‌రాజు లాంటి సినిమాల్లో న‌టించింది. 

 

ఆ త‌ర్వాత ఆమె కుర్ర హీరోయిన్ల పోటీ త‌ట్టుకోలేక పెళ్లి చేసుకుని ఎంచ‌క్కా ఫ్యామిలీ లై ఫ్‌లో సెటిల్ అయి పోయింది. ఇక పెళ్లి త‌ర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు స‌రైన టైం కోసం వెయిట్ చేస్తోన్న ఆమె ఇప్పుడు ఓ త‌ల్లి పాత్ర ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ లోకి ఎంట్రీ ఇస్తోంద‌ట‌. టాలీవుడ్ యంగ్ హీరో కెరీర్ ఆరంభంలో వ‌రుస హిట్లు కొట్టినా త‌ర్వాత వ‌రుస ప్లాపుల‌తో ఇబ్బంది ప‌డుతున్నాడు. ఈ క్ర‌మంలోనే రాజ్ త‌రుణ్ ఇప్పుడు ఓ మంచి క‌థా బ‌లం ఉన్న సినిమాతో హిట్ కొట్టి త‌న స్టామినా ఏంటో ఫ్రూవ్ చేసుకోవాల‌ని చూస్తున్నాడు.

 

ఈ క్ర‌మంలోనే ఈ సినిమాలో రాజ్ త‌రుణ్‌కు త‌ల్లిగా సిమ్రాన్ న‌టించ నుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ప్ర‌స్తుతం లాక్ డౌన్ నేప‌థ్యంలో అన్ని భాష‌ల్లో సినిమాల షూటింగ్‌ల‌కు బ్రేక్ ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో సినిమా ఇండ‌స్ట్రీ తీవ్ర అల్ల‌క‌ల్లోలంలో ఉంది. త్వ‌ర‌లోనే థియేట‌ర్లు ఓపెన్ కావ‌డంతో ఆ త‌ర్వాత సినిమా షూటింగ్‌లు కూడా తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇక రాజ్ త‌రుణ్ - సిమ్రాన్ త‌ల్లి కొడుకుల కాంబినేష‌న్ వెండి తెర‌పై ఎలా ఉంటుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: