తెలుగు చిత్ర పరిశ్రమలో.. కేవలం ప్రేమజంటలకే  కాదు పెళ్లి అయిన జంటలు కూడా చాలానే ప్రేక్షకులకు ఫేవరెట్  గా ఉన్నాయి. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు అయితే టాలీవుడ్ లో మరింత క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలలో  ఎన్నో ఏళ్ల నుంచి టాలీవుడ్ లో ప్రేక్షకులకు ఎవర్గ్రీన్ ఫేవరెట్ జంటగా కొనసాగుతున్నది నాగార్జున అమల జంట. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన నాగార్జున హీరోగా తక్కువ కాలంలోనే తనను తాను నిరూపించుకున్న  విషయం తెలిసిందే.

 

 అయితే నాగార్జున స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలోనే వెంకటేష్ చెల్లెలు దగ్గుబాటి లక్ష్మి ని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య వచ్చిన మిస్ అండర్స్టాండింగ్ కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. అదే సమయంలో టాలీవుడ్ లో హీరోయిన్ గా కొనసాగుతున్న అమల నాగార్జున మధ్య ప్రేమ చిగురించింది. ఎన్నో ఏళ్ల పాటు వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడిచింది . ఆ తర్వాత ఇక వీరి పెళ్లికి అటు అక్కినేని నాగేశ్వరరావు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో పెళ్లితో ఒక్కటయ్యారు ఈ ప్రేమ జంట. 

 

 ఇక వీరి పెళ్లి జరిగి ఎన్నో దశాబ్ద కాలం గడిచిపోతుంది అయినప్పటికీ వీరిద్దరి మధ్య అన్యోన్యత మాత్రం ఇప్పటికీ కొత్తగా పెళ్లయిన దంపతుల్లో  కనిపించినట్లు గానే ఉంటుంది. ఇక వీరి ప్రేమకు గుర్తుగా ఓ కొడుకు కూడా పుట్టాడు. ప్రస్తుతం వీరి ప్రేమకు గుర్తుగా పుట్టిన అఖిల్ టాలీవుడ్ లో హీరోగా పరిచయమయ్యాడు కూడా. ఇదిలా ఉంటే నాగార్జున అమల జోడి ఎప్పుడు ప్రేక్షకులకు ఫేవరెట్ గానే ఉంటుంది. వీరిద్దరి మధ్య ప్రేమ ఆప్యాయతలు దీంతో ఎక్కువగా ఉండి ఈ జంట అన్యోన్యతకు మారుపేరుగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: