అల వైకుంఠపురములో సినిమా తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళి పోయింది. చివరికి ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా అల్లు అర్జున్ సినిమా పాటలకి డాన్స్ వేస్తున్నాడంటే అతడి స్టార్ డం ఎంతవరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్ పుష్ప అనే భిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, పోస్టర్ ఒకటి ఇప్పటికే రిలీజ్ అయ్యి నాలుగు ఐదు రాష్ట్రాల్లో హైప్ క్రియేట్ చేసాయి. ఎప్పుడైతే ఈ సినిమాలో 96 ఫేమ్ విజయ్ సేతుపతి నటిస్తున్నాడని తెలిసిందో... ఆ క్షణం నుండి పుష్ప పై మరింత హైప్ క్రియేట్ అయింది. కానీ అందరి ఆశలపై నీళ్లు చల్లుతూ విజయ్ సేతుపతిసినిమా నుండి అకస్మాత్తుగా తప్పుకున్నాడు. అతను తప్పుకోవడానికి ఎక్కువగా రెమ్యూనరేషన్ అడగడం నిర్మాతలు ఇవ్వకపోవడం అని... ఇతర సినిమాలకు ఒప్పుకొని చాలా బిజీగా ఉండి సినిమా నుండి తప్పుకున్నాడని ఎన్నో నిరాధార కారణాలు తెరపైకి వచ్చాయి కానీ అవన్నీ పుకార్లే.


నిజమేమిటంటే... 96 సినిమాలో విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన తర్వాత అతని పాపులారిటీ అమాంతంగా పెరిగిపోయింది. కానీ ఎనిమిది కోట్ల రెమ్యూనరేషన్ అడిగేంత కాదనుకోండి. సైరా మూవీ లో కూడా నిర్మాత అయిన రామ్ చరణ్ ఇచ్చినంత జేబులో వేసుకుని ఎంచక్కా నటించాడు. రెమ్యూనరేషన్ అంత కావాలి ఇంత కావాలి అని డిమాండ్ చేసే మనస్తత్వం అతనికి లేదు. బిజీ షెడ్యూల్ కారణంగా సినిమా నుండి తప్పుకున్నాడని చెప్పడం అవాస్తవం. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నో సినిమాల్లో అతను కమిట్ అయి ఉంటే... పుష్ప సినిమాకి ఒప్పుకునే వాడు కాదు కదా.


ఐతే ఇంతకీ అతను ఎందుకు తప్పుకున్నాడని అడిగితే ఒక సున్నితమైన విషయం గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. పుష్ప సినిమా ఎర్రచందనం అక్రమ రవాణా కథ నేపథ్యంలో తెరకెక్కుతుందని మనకు తెలుసు. అందులో అల్లు అర్జున్ కథానాయకుడి పాత్రలో నటిస్తున్నాడు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ విజయ్ సేతుపతి నెగిటివ్ పాత్రలో నటించాల్సి ఉంది. నెగిటివ్ పాత్రలో నటించడం తప్పేమీ కాదు అనుకోండి. కానీ బన్నీ స్టార్ డం, పాపులారిటీ, మార్కెట్ తెలుగు హిందీ మలయాళం తమిళ కన్నడ భాషల్లో కూడా విస్తరించింది. సో, పుష్ప మూవీ పాన్ ఇండియా మూవీ లాగా భారత దేశ వ్యాప్తంగా విడుదలవుతుందని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. తమిళంలో ఈ సినిమా రిలీజ్ అయితే విజయ్ సేతుపతికి చెప్పుకోతగ్గ స్థాయిలో ఇబ్బందికరంగా మారుతుంది.


ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన కొత్తలో తమిళ కలప స్మగ్లర్లను దారుణంగా ఎన్కౌంటర్ చేయించాడు. చంద్రబాబు తీరు తమిళ ప్రజలలలో తీవ్ర ఆగ్రహాన్ని నింపింది. మంచివాడైనా చెడ్డవాడైన నేరగాడు అయినా అమాయకుడైనా ఎవరైనా తమిళ ప్రజలు చనిపోతే... మా తమిళ ప్రజలు చనిపోయారు అని తమిళనాడు రాష్ట్ర ప్రజలు బాధపడతారు. వీరప్పన్ చనిపోయినప్పుడు కూడా తమిళనాడు రాష్ట్రం లోలోపల బాధ పడిందని కొంత మంది చెబుతుంటారు. గ్రూపు లీడర్ ప్రభాకరన్ మరణించినప్పుడు కూడా మా తమిళుడు చనిపోయాడని ఆ రాష్ట్ర ప్రజల బాధ పడ్డారట. ఇటువంటి సెంటిమెంట్ ఉన్న ఆ ప్రజల ముందుకు తెలుగు కుర్ర హీరో పక్కన ఎర్రచందనం స్మగ్లర్ గా కనిపించడం విజయ్ సేతుపతి కచ్చితంగా ఒక పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు.


తమిళుడు అయిన తనని తాను ఎర్రచందనం స్మగ్లర్ గా చూపించుకుంటే తమ ప్రజలు జీర్ణించుకోలేరని ఫలితంగా తన పై తీవ్ర వ్యతిరేకత ప్రతిఘటన వస్తుందని విజయ్ సేతుపతి ఆలోచించాడు. కేవలం సినిమా లో కల్పిత పాత్రే కదా అని మాటిస్తే తేలికగా తీసుకోవడానికి తమిళ ప్రజలు సిద్ధంగా ఉండరు... అసలే ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న తను తన మార్కెట్ పాపులారిటీ ఎందుకు పోగొట్టుకోవడమని భావించిన విజయ్ సేతుపతి పుష్ప సినిమాకి నో చెప్పాడని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: