తెలుగు ఇండస్ట్రీలో గేయ రచయితలలో  ప్రముఖులైన వారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. మూడు దశాబ్దాల కిందట కె.విశ్వనాథ్ రూపుదిద్దిన సిరివెన్నెల సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సీతారామశాస్త్రి మూడు తరాల వారికి సంగీత దర్శకులతో పని చేయడం జరిగింది. తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే ఎన్నో మధురమైన పాటలను సీతారామశాస్త్రి గారు అందించడం జరిగింది. ఇప్పటివరకు ఆయనకు 11 నంది అవార్డులు అందుకోవడం జరిగింది. ఇక ఆయన కళామ్మ తల్లికి సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం సిరివెన్నెల సీతారామశాస్త్రి పద్మశ్రీ అవార్డును ప్రకటించడం జరిగింది.


ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని సత్కరించడం జరిగింది.  ఇక హైదరాబాద్ లోని సీతారామశాస్త్రి ఇంట్లో సిరివెన్నెల సిరి మల్లెలు అనే పేరుతో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినీ సాంస్కృతిక రంగాల నుంచి ప్రముఖుల రావడం జరిగింది. వారి సమక్షంలోనే సీతారామశాస్త్రి దంపతులకు.. కె.విశ్వనాథ్ గారు సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సీతారామశాస్త్రి గారు మాట్లాడుతూ.. ఈ అవకాశం కల్పించి, సినీరంగంలోకి అడుగు పెట్టేందుకు సహకరించిన దర్శకులు కే. విశ్వనాథ్ గారిని నేను ఎన్నటికీ మర్చిపోలేను అంటూ తెలిపారు. అలగే ఇన్ని రోజులుగా నా వెంట ఉండి కలిసి ప్రయాణం కొనసాగించిన నిర్మాతలు, దర్శకులు, గాయకులు అందరికీ ధన్యవాదాలు అని తెలిపారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో గేయ కవితగా సొంతం చేసుకున్న పద్మశ్రీ అవార్డు నాది కాదు వారందరిది అని వారి భావనను తెలియజేశారు. 

 

 

ఈ సందర్భంగా కె విశ్వనాథ్ గారు మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడం కాస్త ఆలస్యమైనా.. రావాల్సిన వ్యక్తికి రావడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు. నిత్యం స్వయంకృషి సాధనతో ఈ స్థాయికి ఎదిగిన సీతారామశాస్త్రి తన మొదటి చిత్రం సిరివెన్నెల రోజుల్లో లాగానే అనుకోవడం చాలా విశేషం అంటూ కె విశ్వనాథ్ గారు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: