ఇప్పుడు టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి గానూ హీరోయిన్ లు కొందరు పదే పదే ప్రయత్నాలు చేస్తున్నారు. మన తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ లు గా ఒక వెలుగు వెలిగిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు ఒక్క అవకాశం వస్తే చాలు అనుకునే పరిస్థితిలో ఉన్నారు అనేది వాస్తవం. అందులో ప్రధానంగా చెప్పుకునేది ఇలియానా గురించి. పాప ఒక్క అవకాశం వచ్చినా సరే చాలు అనుకునే విధంగా ఉంది అని అంటున్నారు. 

 

ఇలియానా తెలుగులో స్టార్ హీరోయిన్ గా తిరుగులేకుండా వెలుగోత‌న్న టైంలో ఆమె బాలీవుడ్‌లో వెలిగి పోవాల‌న్న క‌ల‌ల‌తో ఇక్క‌డ బంగారం లాంటి అవ‌కాశాలు వ‌దులుకుని మ‌రీ ఆమె ముంబైలో కూర్చొని హిందీ సినిమాలు అంటూ కాల‌క్షేపం చేసింది. అక్క‌డ చేతులు కాలాక ఇక్క‌డ ఆకులు ప‌ట్టుకుంటే ఉప‌యోగం ఉండ‌దు క‌దా..? అక్క‌డ ఎవ్వ‌రూ ఛాన్సులు ఇవ్వ‌క‌పోవ‌డంతో తిరిగి ఆమె టాలీవుడ్‌కు వ‌చ్చినా అప్ప‌టికే ఇక్క‌డ ఇత‌ర హీరోయిన్ల పోటీ... లావెక్కిన ఇలియానా ఫిజిక్ ఆమెను అవ‌కాశాల నుంచి దూరం చేశాయి. 

 

ఈ నేపధ్యంలోనే ఇటీవల ఆమె ముంబై లో త్రివిక్రమ్ ని కలవగా త్రివిక్రమ్ తర్వాతి సినిమాలో తీసుకుంటాను అని మాట ఇచ్చాడని వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడ ఆమెను తీసుకునే విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ని అడిగి చెప్తాను అని చెప్పాడ‌ట‌. తర్వాతి సినిమా తారక్ తోనే చేస్తున్నాడు అతను. దీనితో తారక్ తో ఇలియానా మాట్లాడింది అని అంటున్నారు. ఈ రోజు ఫోన్ చేసి ఆమె విష్ కూడా చేసినట్టు సమాచారం. 

 

ఇక ముందు మాట్లాడిన సమయంలో తన సినిమాలో తీసుకుంటా అని ఎన్టీఆర్ మాట ఇచ్చాడని, త్రివిక్రమ్ కి కూడా చెప్పాడు అని సమాచారం. త్రివిక్రమ్ కూడా అందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. మరి ఇది ఎంత వరకు నిజం అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాలి. రష్మిక ను వద్దని ఎన్టీఆర్ ఇలియానా ను తీసుకునేందుకు ఓకే చెపుతాడా ? అన్న‌ది కూడా కాస్త డౌటే..?

మరింత సమాచారం తెలుసుకోండి: