పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు ఇద్దరూ పాలిటిక్స్ ను టార్గెట్ చేస్తున్నారు. పొలిటికల్ సెటైర్లు పేల్చుతూ.. వెండితెరపై రాజకీయాలు చేస్తున్నారు. ఒకరు స్టేట్ పాలిటిక్స్ ను టార్గెట్  చేస్తుంటే.. మరొకరు సెంట్రల్ ని వేలెత్తి చూపిస్తున్నారు. దీంతో తెలుగుతెరపై కొత్త రాజకీయం మొదలవుతోందనే ప్రచారం ఎక్కువైంది. 

 

పవన్ కళ్యాణ్ పాలిటిక్స్, సినిమాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తున్నాడు. జనసేనగా రాజకీయాలు, పవర్ స్టార్ గా సినిమాలు చూసుకుంటున్నాడు. అయితే ఇప్పటి వరకు రెండు ప్రొఫెషన్స్ ను వేర్వేరుగా చేసిన పవన్, ఇప్పుడు సినిమాల్లోకి పాలిటిక్స్ ను తీసుకొస్తున్నాడనే  టాక్ వస్తోంది. 

 

పవన్ కళ్యాణ్ తర్వాత క్రిష్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఔరంగజేబు కాలం నాటి కథాంశంతో ఈ మూవీ తెరకెక్కబోతోంది. హిస్టారికల్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో పొలిటికల్ సెటైర్స్ ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. నేటి రాజకీయ స్థితికి తగ్గట్టుగా రాజకీయాస్త్రాలు సంధిస్తాడనే ప్రచారం జరుగుతోంది. 

 

మహేష్ బాబు ఫ్యామిలీలో పొలిటీషియన్స్ ఉన్నా.. ఈ హీరో మాత్రం రాజకీయాలను పెద్దగా టచ్ చెయ్యడు. పాలిటిక్స్ పై కామెంట్స్ కూడా చెయ్యడు. కానీ ఇప్పుడు వరుసగా పొలిటికల్ కోటింగ్ ఉన్న సినిమాల్లో నటిస్తున్నాడు మహేశ్ బాబు. కెమెరాల ముందు పొలిటికల్ సెటైర్స్ పేల్చుతున్నాడు. 

 

మహేశ్ బాబు తర్వాత పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. మైత్రీ మేకర్స్, 14రీల్స్ ప్లస్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఇక ఈ మూవీకి సర్కారు వారి పాట అనే టైటిల్ వినిపిస్తోంది. 

 

సర్కారు వారి పాట పొలిటికల్ సెటైర్ అనే ప్రచారం జరుగుతోంది. దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన బ్యాంక్ కుంభకోణాలను ఈ మూవీలో ప్రస్తావిస్తారని సమాచారం. భరత్ అనే నేను సినిమాలో కరప్టడ్ పాలిటిక్స్ పై ఎంత ఘాటుగా విమర్శించాడో, ఈ సర్కారు పాటలోనూ అలాంటి డైలాగులుంటాయని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: