తెలుగు చిత్ర పరిశ్రమలో  మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్గా... తొలి తెలుగు స్వతంత్ర సమరయోధుడు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి.ఈ  సినిమా మొదటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచిన విషయం తెలిసిందే. చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా  తెరకెక్కింది ఈ సినిమా. తొలి తెలుగు స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. చరిత్రలో కనుమరుగవుతున్న ఉయ్యాలవాడ చరిత్రను ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామూ  అంటూ చిత్ర బృందం ప్రకటనలు కూడా చేసింది. ఇక ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో  మెగాస్టార్ చిరంజీవి నటించగా...  ఉయ్యాలవాడ భార్య పాత్రలో నయనతార నటించింది. 

 


 ఇక ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ టీజర్  ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచేసింది. ఇక ఈ సినిమా కి ముందు ఈ సినిమాపై ఎన్నో వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ముఖ్యంగా సైరా నరసింహారెడ్డి ప్రధాన అనుచరుడైన వ్యక్తిని చూపించకుండా బయోపిక్ ఎలా తెరకెక్కిస్తారు అంటూ సినిమాకు వివాదాలు చుట్టుముట్టాయి. ఇక ఈ సినిమాపై అటు ఉయ్యాలవాడ వారసులు కూడా కాస్త అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇలా మొదటి నుంచి ఈ సినిమాకి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఈ సినిమా వివాదాలను దాటుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా భారీ అంచనాలను ప్రేక్షకుల్లో పెంచేసింది అన్న విషయం తెలిసిందే. అయితే విడుదలైన తర్వాత మాత్రం ప్రేక్షకుల అంచనాలను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేక పోయింది ఈ సినిమా. 

 


 కేవలం ఆవరేజ్ టాక్ మాత్రమే సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి నటనకు ప్రశంసలు దక్కాయి అనే చెప్పాలి. అయితే ఈ సినిమా వసూళ్లని  చిత్రం బృందం విడుదల చేస్తే అవన్నీ ఫేక్ వసూళ్ళని..  ఈ సినిమా అంతగా వసూలు రాబట్ట  లేదు అనే వివాదాలు కూడా సినిమాకి చుట్టుముట్టాయి. ఈ సినిమా భారీ నష్టాలను చవిచూసింది అనే వాదన కూడా బలంగా వినిపించింది. అయితే ఈ సినిమా వసూళ్ల విషయంలో నిర్మాత రామ్ చరణ్ మాత్రం ఎక్కడా స్పందించిన దాఖలాలు మాత్రం లేవు. ఇలా స్వతంత్ర సమరయోధుడు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా అయినప్పటికీ ఈ సినిమాకు కూడా వివాదాల గోల  తప్పలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: