తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో ఎన్నో లవ్ స్టోరీలు  ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. కానీ కొన్ని సినిమాల్లోని లవ్ స్టోరీ లు మాత్రం ఎప్పుడు ఇండస్ట్రీలో ఎవర్గ్రీన్ గా నిలిచి పోతుంటాయి. ఇలా  ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ గా నిలిచినా లవ్ స్టోరీ లు  చాలా తక్కువగానే ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇప్పటికి కూడా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించింది... ఎంతగానో ఆకట్టుకునే లవ్ స్టోరీ మాత్రం దేశముదురు లవ్ స్టోరీ అని చెప్పాలి. ఈ సినిమాలో లవ్ స్టోరీ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. 

 


ఒక సాదాసీదా అమ్మాయిని కాదు హీరో ఏకంగా సన్యాసిని లవ్ చేస్తాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత సెన్సేషన్ సృష్టించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో మొదటిసారిగా అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ లో కనిపించడం కూడా మరింత ప్రేక్షకులను ఆకర్షించింది. సినిమాలో  అల్లు అర్జున్ హీరోగా నటించగా అల్లు అర్జున్ సరసన అందాల ముద్దుగుమ్మ హన్సిక హీరోయిన్ గా నటించింది . ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ హన్సిక మధ్య లవ్ స్టోరీ విషయానికొస్తే... జీవితం మీద విరక్తి తో హన్సిక యువతిగా ఉన్నప్పుడే సన్యాసాన్ని తీసుకుంటుంది.

 

 అయితే అల్లు అర్జున్ కులుమనాలి వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో మంది సన్యాసుల్లో  హన్సిక కనిపిస్తుంది. మామూలుగా అయితే ఎవరైనా సన్యాసి ని గౌరవిస్తారు కానీ అల్లు అర్జున్ మాత్రం ఏకంగా సన్యాసి గా ఉన్న హన్సిక ను కూడా ప్రేమిస్తాడు. ఇక ఎలాగోలా హన్సికను ప్రేమలో పడేస్తాడు అల్లు అర్జున్. ఆ తర్వాత హన్సిక సన్యాసం తీసుకోవడానికి గల కారణాలు తెలుసుకొని వాటన్నింటిని సాల్వ్ చేయడానికి వెళ్తాడు . హన్సిక ప్రేమను పొందడానికి అల్లు అర్జున్ ఎన్నో అష్టకష్టాలు పడతాడు అనే చెప్పాలి. చివరికి హన్సిక అల్లు అర్జున్ ను  ప్రేమించినప్పటికీ కూడా సన్యాసిగా ఉండటం కారణంగా అల్లుఅర్జున్ పై తనకున్న ప్రేమను వ్యక్తపరచదు . ఇలా ఈ సినిమాలోని లవ్ స్టోరీ ఎంతో డిఫరెంట్ గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: