తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం చాలా మంది హీరోయిన్లు తమ హవా నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది దశాబ్దకాలానికి పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నప్పటికీ యువ హీరోయిన్లకు సైతం పోటీగా కొనసాగుతున్నారు.ఇలా  దశాబ్ద కాలానికి పైగా తెలుగు చిత్రపరిశ్రమలో హవా నడిపిస్తున్న హీరోయిన్ సమంత. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా సమంతకి మాత్రం ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఏం మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా  పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది.



 అయితే మొదటి నుంచీ ఎన్నో గ్లామర్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది సమంత. అయితే దాదాపుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అందరు స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో గ్లామరస్ పాత్రలో నటించి తన అందచందాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అయితే కెరీర్ మొదట్లో సమంత నటనతో అంతగా ఆకట్టుకోలేక పోయింది అని చెప్పాలి. గ్లామర్ పాత్రల్లో మెరిసి కాస్త ప్రేక్షకులను ఆకర్షించినప్పటికీ తన నటనతో మాత్రం మెప్పించలేకపోయింది. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం నటిగా ఎంతో పరిణితి చెందింది సమంత. ప్రస్తుతం సమంత నటనకు ఫిదా అవని తెలుగు ప్రేక్షకుడు అనడంలో అతిశయోక్తి లేదు,



 గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంచి కేవలం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హావా నడిపిస్తుంది అక్కినేని వారి కోడలు సమంత. ప్రస్తుతం ప్రతీ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరీ తన నటనతో పాత్రకు ప్రాణం పోసి  విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. అక్కినేని వారి కోడలు సమంత. సమంత  ఏం పాత్రలో నటించిన ఆ   పాత్రలో  అద్భుతమైన నటన ఉండడం ఖాయమని తెలుగు ప్రేక్షకులు భావించెంతల  తన నటనతో ప్రభావితం చేసింది సమంత.


Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: