తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక మందన కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన రష్మిక మందన అతి తక్కువ సినిమాలతోనే స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగింది. ముఖ్యంగా ఈ అమ్మడి ఆటిట్యూడ్ నటనతో ఎంతగానో క్రేజ్ సంపాదించింది అని చెప్పాలి. మొదటి నుంచి అందాల ఆరబోతకు దూరంగానే ఉంది రష్మిక మందన. ఇక ఇప్పటి వరకు రష్మిక చేసిన సినిమాలలో తాను పోషించిన పాత్రలన్ని నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే అని చెప్పాలి.
ఇలా మొదటి నుంచి తన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది రష్మిక మందన, అదేసమయంలో తన అభినయంతో కూడా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కేవలం చిలిపి నవ్వుతోనే తెలుగు ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టింది ఈ ముద్దుగుమ్మ. తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటుంది. ఇలా నటనతో అందంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తన హవా నడిపిస్తూ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది రష్మిక మందన.
Powered by Froala Editor
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి