ప్రపంచ వ్యాప్తంగా వినపడుతున్న కరోనా మహమ్మారి ప్రభావం రోజు రోజుకు పెరుగుతోంది.. ఈ కరోనా వల్ల మధ్యతరగతి , చిన్న తరహా కుటుంబాలు ఇంకా నష్టాల్లోకి కూరుకొని పోయాయి.. రెక్కాడితే కానీ డొక్కాడని వారి జీవితాలు చివరికి అడుక్కునే స్థాయి కి పడిపోయాయి.. ఇకపోతే కరోనా పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను కేంద్ర ప్రభుత్వం విధించింది.దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.. 

 

 

ఇకపోతే ఎంత కఠిన మైన చర్యలు తీసుకున్న కూడా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో మహమ్మారి జూలు విదిల్చి న సంగతి తెలిసిందే.. రోజుకో విధంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి..మొదట తెలంగాణ తో పోలిస్తే ఆంధ్రాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదు అయ్యేది.. దీని పై చాకచక్యంగా వ్యవహరించిన ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి కరోనా ప్రభావాన్ని  తగ్గించే దిశగా చర్యలను చేపట్టారు. అందుకు సంబంధించిన పురోగతిని రోజురోజుకు పరీక్షించడం వల్ల ఇప్పుడు ఆంధ్రలో కరోనా ప్రభావం ఓ మాదిరిగా తగ్గిందనే చెప్పాలి.. 

 

 

ఈ మేరకు సీఎం మరో కొత్త ఆలోచనలకు తెర తీసాడు.. ఏపీలో 1,088 అంబులెన్సులను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. విజయవాడలో ఈ వాహనాలను ముఖ్యమంత్రి జగన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అవన్నీ విజయవాడ నుంచి జిల్లాలకు పయనమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినీ ప్రముఖులు సైతం సీఎంను ప్రశంసించారు.ప్రపంచమంతా కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న సమయంలో... ఏపీ ప్రభుత్వం 108,104 వాహనాలను ప్రవేశపెట్టిందని దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రశంసించారు. హ్యాట్సాఫ్ జగన్ గారూ అంటూ కొనియాడారు. సంగీత దర్శకుడు తమన్ కూడా ప్రశంసించారు.జగన్ నిర్ణయం సరైనదే అంటూ ప్రతి ఒక్కరూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: