‘సాహో’ ఘోర పరాజయం తరువాత సుజిత్ కి ఊహించని అదృష్టంగా చిరంజీవితో ‘లూసిఫర్’ రీమేక్ లభించింది. దీనితో చిరంజీవి ఇచ్చిన సూచనలతో ఈమూవీ తెలుగు వెర్షన్ కు సుజిత్ అనేక మార్పులుచేర్పులు చేసి ఈమధ్యనే తాను తయారుచేసిన ఫైనల్ స్క్రిప్ట్ ను చిరంజీవి చేతికి ఇచ్చాడు.


ఈ స్క్రిప్ట్ ను పూర్తిగా చదివిన చిరంజీవి సుజిత్మూవీ స్క్రిప్ట్ లో చేసిన మార్పులకు పెదవి విరిచాడు అంటూ వార్తలు రావడంతోపాటు ఈమూవీ రీమేక్ బాధ్యతను సుజిత్ కు తప్పించి వినాయక్ ఇవ్వబోతున్నారు అంటూ గాసిప్పులు కూడ వచ్చాయి. దీనితో సుజిత్ ఒక మంచి అవకాశాన్ని కోల్పోయాడా అంటూ చాలామంది అతడి పై సానుభూతి కూడ చూపెట్టారు.


వాస్తవానికి చిరంజీవి సుజిత్ ల మధ్య ఈ మూవీ విషయంలో గ్యాప్ ను ఏర్పరిచింది ఒక లవ్ ట్రాక్ అని అంటున్నారు. వాస్తవానికి మళయాళ వెర్షన్ ‘లూసిఫర్’ మూవీలో మోహన్ లాల్ పాత్రకు ఎటువంటి లవ్ ట్రాక్ ఉండదు. అయితే చిరంజీవి సినిమాలు అంటే పాటలు స్టెప్స్ ఉండితీరాలి కాబట్టి సుజిత్ ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ క్రియేట్ చేయడమే కాకుండా ఆ ఫ్లాష్ బ్యాక్ లో చిరంజీవి కోసం ఒక లవ్ ట్రాక్ ను కూడ క్రియేట్ చేసాడట.


అయితే మళయాళ వెర్షన్ లో లేని ఈ లవ్ ట్రాక్ ను అనవసరంగా ఈ మూవీలో పెడితే ఈమూవీ అసలు కథకు ప్రాముఖ్యత తగ్గుతుంది అన్న సలహా ఒక టాప్ డైరెక్టర్ చిరంజీవికి ఇవ్వడంతో ఈ లవ్ ట్రాక్ వద్దు అని సుజిత్ కు చిరంజీవి చెప్పినట్లు టాక్. దీనితో సుజిత్ మరొకసారి ఈ మూవీ స్క్రిప్ట్ ను తిరిగి మార్చి రాయడానికి తన టీమ్ తో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మెగా స్టార్ కు ఒక స్క్రిప్ట్ విషయంలో చెప్పి ఒప్పించడం ఎంత కష్టమో ఇప్పటికి సుజిత్ కు బాగా తెలిసి ఉంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: