ఒక్కొక్క సినిమాతో దర్శకుడిగా తన రేంజ్ ని అమాంతం పెంచుకుంటూ ముందుకు సాగుతున్న టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి, ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ల కలయికలో భారీ మల్టిస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై v v DANAYYA' target='_blank' title='డివివి దానయ్య-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>డివివి దానయ్య అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలావరకు పూర్తి అయింది. ఇటీవల కరోనా కారణంగా మిగతా సినిమా షూటింగ్స్ తో పాటు ఈ సినిమా షూట్ కూడా వాయిదా పడింది. పేట్రియాటిక్ కథాంశంతో 1920ల కాలం నాటి కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, కొమరం భీం గా నటిస్తుండగా, రామ్ చరణ్, అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. 

 

వచ్చే ఏడాది జనవరి 8 న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక దీని అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఒక సినిమా చేయనున్నారు రాజమౌళి. ఇప్పటికే ఈ సినిమా కథ విషయమై తన తండ్రి వి. v VIJAYENDRA PRASAD' target='_blank' title='విజయేంద్ర ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విజయేంద్ర ప్రసాద్ తో పలు కథలను చర్చించిన రాజమౌళి, అతి త్వరలో ఒక స్టోరీ ని ఫైనలైజ్ చేయనున్నారట. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అనంతరం ఈ సినిమా అఫీషియల్ అనౌన్సుమెంట్ వస్తుందని, ఆ తరువాత పట్టాలెక్కే ఈ సినిమా, 2023లో ప్రేక్షకుల ముందు వచ్చే ఛాన్స్ ఉందట. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రాజమౌళి సినిమా విషయమై కూడా కొన్నాళ్లుగా పలు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. వాస్తవానికి కొన్నేళ్ల క్రితం వీరిద్దరి కలయికలో ఒక సినిమా రావలసిందని, అయితే అప్పట్లో కొన్ని కారణాల వలన అది ఇప్పటివరకు సెట్ కాలేదని సమాచారం. 

 

అయితే తాను కూడా పవన్ తో సినిమా చేయాలని ఎప్పటినుండో ఎదురు చూస్తున్నానని, కానీ మంచి కథతో పాటు అన్ని అంశాలు సెట్ అవ్వాలని ఇటీవల రాజమౌళి కూడా పలు సందర్భాల్లో చెప్పారు. పవన్ తో సినిమా విషయమై రాజమౌళి కి ఒక క్లారిటీ ఉందని, ఇప్పటికే మహేష్ తో తన నెక్స్ట్ సినిమా ని అనౌన్స్ చేసిన రాజమౌళి, అవకాశం ఉన్నంతవరకు, దాని తరువాత పవన్ తో పనిచేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే అన్నీ అనుకున్నట్లు జరిగి వారిద్దరి కాంబో సినిమా కనుక సెట్ అయితే, అప్పటి పరిస్థితులను బట్టి షూటింగ్ పూర్తి చేసుకుని, అది థియేటర్స్ లోకి వచ్చే సరికి 2025 సంవత్సరం అవుతుందని టాక్. అయితే వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే అప్పుడు వస్తుందా, వామ్మో అంటూ కొందరు ప్రేక్షకులు, పవన్ అభిమానులు ఆశ్చర్యపోతూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా పవన్, రాజమౌళి కాంబోలో సినిమా వస్తుందా, వస్తే ఎప్పుడు వస్తుంది, ఇటువంటి ప్రశ్నలు అన్నిటికీ రాబోయే రోజుల్లో కాలమే సమాధానం చెప్పాలని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!    

మరింత సమాచారం తెలుసుకోండి: