గత ఏడాది యువి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన సాహో మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెబల్ స్టార్ ప్రభాస్, ఆ సినిమాతో ఆశించిన రేంజ్ సక్సెస్ ని అయితే అందుకోలేకపోయారు. సుజీత్ దర్శకత్వంలో భారీ యాక్షన్ మూవీ గా తెరకెక్కిన ఆ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించింది. దాని అనంతరం పూజా హెగ్డే తో కలిసి ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమా రాధేశ్యామ్. యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో, కొన్నేళ్ల క్రితం యూరోప్ లో జరిగిన రెట్రో ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రోల్ అదిరిపోనుందని సమాచారం. యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారు. దీని తరువాత ప్రభాస్ నటించబోయే తదుపరి సినిమా ప్రకటన కూడా ఇటీవల వచ్చింది.

మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందనున్న ఆయన తదుపరి సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి. అశ్వినీదత్ ఎంతో భారీ రేంజ్ లో నిర్మించనున్నారు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, పాన్ ఇండియా రేంజ్ ని మించి పలు ఇతర విదేశీ భాషల్లో కూడా రిలీజ్ కానున్న ఈ సినిమా, భారత దేశంలోనే అత్యధిక బడ్జెట్ మూవీగా తెరకెక్కనున్నట్లు టాక్. కాగా ఈ సినిమాకు రూ. 650 కోట్ల మేర ఖర్చు పెట్టనున్నారని, అలానే పలు హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన నిపుణులైన టెక్నీషియన్లు ఈ సినిమాకు పనిచేయనున్నారని చెప్తున్నారు.
మరోవైపు టాలీవుడ్ సహా, పలువురు కోలీవుడ్, బాలీవుడ్ నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా కోసం ఇప్పటికే భారీ ప్లానింగ్స్ మొదలెట్టారట దర్శక నిర్మాతలు. ఒకరకంగా ఈ సినిమా ప్రభాస్ కెరీర్ ని డిసైడ్ చేసే గేమ్ చేంజెర్ సినిమా అవబోతోందని, అన్నీ అనుకున్నట్లు కుదిరి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే, దానితో ప్రభాస్ కెరీర్ ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు చేరుతుందని, అదే అనుకోని విధంగా అపజయం పాలైతే మాత్రం, ప్రభాస్ కెరీర్ కు కొంత ఇబ్బందులు కూడా ఎదురయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. మొత్తంగా ప్రభాస్ ఫ్యూచర్ ని డిసైడ్ చేయబోయే సినిమాగా, నాగ అశ్విన్ మూవీ నిలవనుంది అనేది మాత్రం కొంతవరకు వాస్తవం అని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి