ప్రస్తుతం  తెలుగులో పాన్ ఇండియా జోరు నడుస్తోంది. దాదాపు స్టార్ అందరూ ఇదే బాట పట్టారు. బన్నీ పుష్పతో.. తారక్ ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియాలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. త్వరలో పాన్ ఇండియా వదిలేసి పాన్ వరల్డ్ లోకి అడుగుపెడతారు. ఇందుకు ఉదాహరణ సాహో. తెలుగులో సాహో ఫ్లాప్ అయినా.. హిందీ హిట్టయింది. జపాన్ లో రికార్డులు కొల్లగొట్టింది. కరోనా టైమ్ లో దేశం కాని దేశంలో సాహో సందడి చేస్తోంది. 

 

సాహో నిరాశపరిచినా.. ప్రభాస్ కు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పుడది ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. బాహుబలి సిరీస్ చైనీయులకు నచ్చకపోయినా.. జపాన్ ఆడియన్స్ మాత్రం ఫిదా అయిపోయారు. ఓ కార్యక్రమంలో బాహుబలి 2లోని భళిరా సాంగ్ ను పెర్ ఫార్మ్ చేసి తెలుగు వారికి దగ్గరయ్యారు. 

 

జపాన్ లో ప్రభాస్ కు బాహుబలితో వచ్చిన క్రేజ్ కంటిన్యూ అవ్వడమే కాదు రెట్టింపయింది. కరోనా పరిస్థితుల నుంచి కోలుకున్న జపాన్ ఈ మధ్యనే థియేటర్స్ ఓపెన్ చేసింది. సాహో సినిమాను రిలీజ్ చేయగా.. భారీ వసూళ్లు రాబట్టడమే కాదు.. ఇండియన్ మూవీస్ లో టాప్ గా నిలిచింది. 


సాహోకు ముందు అమీర్ ఖాన్ నటించిన దంగల్ జపాన్ లో భారీ వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ రికార్డును సాహో బ్రేక్ చేసింది. జపాన్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ టెన్ మూవీస్ లిస్ట్ లో ముత్తు.. ఇంగ్లీష్ వింగ్లీష్.. 3 ఇడియట్స్ కూడా ఉన్నాయి. వీటిలో రెండు సినిమాలు సాహో.. బహుబలి 2 ప్రభాస్ వి కావడం విశేషం. 

 

జపాన్ లో తెలుగు సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. మన స్టార్స్ ను అభిమానించడమే కాదు..ఇండియాకు వచ్చి కలిసేంత డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారంటే ఆశ్చర్యమే. ముఖ్యంగా ఎన్టీఆర్ ఇంతటి అభిమానం సంపాదించుకున్నారు. 

 

జపనీస్ అభిమానం దేశం దాటి ఇండియాలోకి వచ్చింది. వీళ్లను ముందుగా ఇంప్రెస్ చేసింది రజినీకాంతే. సూపర్ స్టార్ నటిచిన ముత్తు సినిమాకు జపాన్ ఆడియన్స్ ఫిదా అయిపోయి కలెక్షన్స్ వర్షం కురిపించారు. ఆ తర్వాత రజినీ నటించి ప్రతి చిత్రం జపాన్ లో విడుదల కావాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: