టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, తొలిసారిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బద్రి సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన పూరి, ఆ తరువాత వరుసగా అవకాశాలు అందుకున్నారు. మధ్యలో రవితేజతో పూరి తీసిన ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలు గొప్ప విజయాలు అందుకుని దర్శకుడిగా పూరి కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆ తరువాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ తో ఆయన తీసిన పోకిరి సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి, అప్పటివరకు ఉన్న పాత రికార్డ్స్ అన్ని బద్దలు కొట్టడంతో పాటు, పూరి జగన్నాథ్ కు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది.
ఆ తరువాత చిరుత, దేశముదురు, బిజినెస్ మ్యాన్, టెంపర్, గోలీమార్ సినిమాలతో మాత్రమే విజయాలు అందుకున్న పూరి, మధ్యలో ఎన్నో ఫ్లాప్స్ చవిచూశారు. ఇక ఇటీవల రామ్ హీరోగా తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ తో ఫైనల్ గా హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చిన పూరి, ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ మూవీ తీస్తున్నాడు. కాగా ప్రస్తుతం కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, అతి త్వరలో జూనియర్ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ ల కలయికలో ఒక సినిమా తెరకెక్కనున్నట్లు చెప్తున్నాను. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ఆంధ్రావాలా ఫ్లాప్ గా నిలవగా, టెంపర్ మూవీ సూపర్ హిట్ కొట్టింది.
అయితే ఈ హ్యాట్రిక్ సినిమాకు సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీ అయిన పూరి, అతి త్వరలో ముగించి, దానిని ఎన్టీఆర్ కు వినిపించనున్నాడని, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కనున్న ఈ సినిమా, ప్రస్తుతం ఎన్టీఆర్ ఒప్పుకున్న సినిమాల అనంతరం మొదలవుతుందని టాక్. మరి ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం, మరికొద్దిరోజుల్లో పూరి, ఎన్టీఆర్ ల హ్యాట్రిక్ కలయికలో ఒక సినిమా చూడవచ్చన్నమాట .....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి