సుశాంత్‌ మాజీ మేనేజర్‌ దిశా సలియాన్ జూన్ 8న సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసినదే. ఆమె సూసైడ్ తర్వాత జూన్ 14న బాలీవుడ్ హీరో  సుశాంత్ ఆత్మహత్యకి పాల్పడి మరణించాడు. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది.. ఇప్పటికే అనేక అనుమానాలు కలిగించింది ఈ కేసు. సుశాంత్‌ మాజీ మేనేజర్‌ దిశా సలియాన్ ముంబై లోని మలద్‌ ప్రాంతం లో అపార్ట్మెంట్ పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇందుకు గాను సుశాంత్‌ మృతికి దిశా సలియన్‌ సూసైడ్ కి ఏమైనా సంబంధం ఉందా...? అని అనుమానాలు రేకెత్తాయి.


వీటి గురించే దిశ తండ్రి సతీష్ సలియాన్ తన ఫ్యామిలీని మానసిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ చెప్పారు. ఈ మేరకు ఆయన మహారాష్ట్ర లోని మాల్వాని అదనపు పోలీసు కమిషనర్ దిలీప్ యాదవ్‌ కు లేఖ రాశారు.  ఈ లేఖలో సతీష్ తమ కుటుంబంపై జరుగుతున్న మానసిక వేధింపుల గురించి, మరణించిన తన కుమార్తె గురించి  మీడియా మరియు జర్నలిస్టులు వ్యవహరిస్తున్న తీరు గురించి పోలీసులకి తెలిపారు. తనని వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన లేఖలో తెలియజేసారు.


తమ కుమార్తె మరణానికి సంబంధించి ఎవరిని అన్యాయంగా బాధ్యులను చేయవద్దని గతంలోనే పోలీసులను కోరామని సతీష్ చెప్పారు. అలానే ముంబై పోలీసుల పై విశ్వాసాన్ని పదేపదే ప్రశ్నిస్తూ మీడియా వారు ఎంక్వైరీ చేయడంతో వేధింపులు తీవ్రంగా ఉన్నాయన్నారు. గతం లోనే ఎవరిపైనా అనుమానం లేదని పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాము అని చెప్పారు. జర్నలిస్టులు, రాజకీయ నాయకులు మరియు మీడియా వారి పై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకి వ్రాసిన లేఖలో దిశా తండ్రి సతీష్ సలియాన్ పేర్కొన్నారు. దిశ సలియాన్‌ ఆత్మహత్య చేసుకోలేదని.. లైంగిక దాడికి పాల్పడి హత్య చేశారని బీజేపీ ఎంపీ నారాయణ్‌ రాణే సంచలన ఆరోపణలు చేసిన తర్వాత రోజునే దిశా తండ్రిలేఖ రాసారు పోలీసులకి .

 

మరింత సమాచారం తెలుసుకోండి: