కథలో నక్సలిజం అంతర్భాగంగా ఉన్న మరో సినిమా ఆచార్య. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎపిసోడ్‌లో చిరంజీవితోపాటు రామ్‌చరణ్ కూడా నక్సలైట్‌గా కనిపిస్తాడట. ఆర్‌ఆర్‌ఆర్.. ఆచార్య. ఇలా యాదృశ్చికంగా రెండు ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ మూవీస్ చేస్తున్నాడు రామ్‌చరణ్.
ఉప్పెనతో హీరోగా పరిచయమైన సాయిధరమ్‌తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ రెండో సినిమాకే అడవిని ఎంచుకున్నాడు. క్రిష్ డైరెక్షన్‌లో నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ కరోనాటైంలోనే నరసాపూర్ ఫారెస్ట్‌లో మొదలైంది. 40 రోజుల్లో షూటింగ్ పూర్తిచేయాలన్న పట్టుదలతో క్రిష్ ఉన్నాడు. షూటింగ్ దాదాపుగా అడవి... పల్లెటూరులో జరుగుతుంది. క్రిష్ ఫస్ట్ మూవీ గమ్యం తర్వాత మరోసారి అడవిని ఎంచుకున్నాడు.
మెగా ఫ్యామిలీలో నలుగురు హీరోలు అడవి బిడ్డలుగా మారిపోయారు. చిరంజీవి, రామ్‌చరణ్, బన్నీ వంటి స్టార్స్‌తోపాటు అప్‌కమింగ్ హీరో వైష్ణవ్ తేజ్ కూడా అడవిలో ప్రయాణిస్తున్నాడు. ఇంక నందమూరి ఫ్యామిలీ నుంచి తారక్.. దగ్గుబాటి కుటుంబం నుంచి రానా కూడా అడవి బాట పట్టారు. ఈ అడవి బిడ్డలు నటిస్తున్న సినిమాల వ్యాపారం దాదాపు 1000 కోట్లు. అందులో సగం 500 కోట్లు ఆర్‌ఆర్‌ఆర్‌దే కావడం విశేషం. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న పుష్ప 150 కోట్లు... ఆచార్య 150 కోట్లు బిజినెస్ చేస్తాడు.
మొత్తానికి తెలుగు సినిమా అడవి తల్లిని నమ్ముకుంది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వరుస సినిమాలు వచ్చేస్తున్నాయి. మెగా హీరోలు అడవి బిడ్డలుగా మారిపోయారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి