తెలుగులో పిల్ల జమిందార్ సినిమాతో సత్తా చాటి ఆ తర్వాత సుకుమారుడుతో ఫెయిల్ అయిన అశోక్ స్వీటీ అనుష్కతో చేసిన భాగమతి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాతో అనుష్క కూడా మరోసారి సూపర్ ఫాం లోకి వచ్చేలా చేసింది భాగమతి. అయితే ఈ సినిమా హిట్ తో బాలీవుడ్ లో కూడా భాగమతిని రీమేక్ చేశాడు అశోక్. హిందీ రీమేక్ లో భూమి పడ్నేకర్ తో తెరకెక్కించిన ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ అవుతుంది.

ఇక ఈ సినిమా రిలీజ్ అవకుండానే బాలీవుడ్ లో అశోక్ కు మరో ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఉఫ్ అంటూ ఓ ప్రయోగాత్మక సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు అశోక్. ఈ సుబునాలో నుష్రత్ బరూచా, నోరా ఫతేహి, సోహం షాలూ నటిస్తున్నారు. బాలీవుడ్ డైరక్టర్ లవ్ రంజన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారని తెలుస్తుంది. భాగమతి హిందీ రీమేక్ రిలీజ్ అవకుండానే అశోక్ కు అక్కడ మరో లక్కీ ఛాన్స్ రావడం విశేషమని చెప్పొచ్చు.

అక్కడ వరుస ఛాన్సులు వస్తుండటంతో తెలుగులో అశోక్ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. అసలైతే భాగమతి తర్వాత తెలుగులోనే మరో సస్పెన్స్ మూవీ చేయాలని అనుకున్న అశోక్ కు భాగమతి హిందీ రీమేక్ ఆఫర్ రాగానే అక్కడకు జంప్ అయ్యాడు. ఈమధ్య తెలుగులో హిట్టైన సినిమాలు హిందీ రీమేక్ చేస్తుండటం.. మన దర్శకులకే డైరక్షన్ ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది.                                                                                     

మరింత సమాచారం తెలుసుకోండి: