రొమాన్స్, గొడవలు, రూమర్లు ఎవన్నీ ఉన్న ఒకే ఒక్క టాప్ రియాలిటీ షో బిగ్ బాస్.. ఈ షో ప్రతి ఒక్క సినీ ఇండస్ట్రీలో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.. ఇకపోతే ప్రస్తుతం ఈ షో తెలుగు లో నాలుగో సీజన్ ను జరుపుకుంటుంది. ఈ షో లో ఎప్పుడు చూడని మొహాలు కూడా ఇప్పుడు ప్రత్యక్షమవుతున్నాయి. షో మొదలై ఏడు వారాలు పూర్తయిన సంగతి తెలిసిందే.. ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు ఎనిమిదో వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది..



అయితే బిగ్ బాస్ లో ప్రస్తుతం సందడి చేస్తున్న ఇంటి సభ్యులు అందరి ప్రేమ వ్యవహారాలు ఉన్నాయి.  కొంత మందికి మాత్రం ఫెయిల్ అయ్యాయి..లాస్ట్ ఎపిసోడ్ లో ఎలిమినేట్ అయిన దివి గురించి సంచలన నిజాలను ఆమె తల్లి దండ్రులు బయట పెట్టారు. అది కాస్త వైరల్ అవుతుంది.. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బ్రేకప్ లవ్ స్టోరీని బయటపెట్టింది దివి. ఈ విషయం పై చాలా పుకార్లు రావడంతో దివి అమ్మానాన్నలు స్పందించారు. దివి ప్రేమించింది మా వాళ్ల అబ్బాయినే.. ఒకర్నొకరు ఇష్టపడ్డారు.. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అయితే అబ్బాయి వాళ్ల బ్రదర్ మలేరియా వచ్చి చనిపోయారు. వాళ్లది పల్లెటూరు.. తమ్ముడు ఉన్నాడు అమ్మా నాన్నలను ఊర్లో ఉండి చూసుకుంటాడు. మనం సిటీలో ఉందాం అని మా అమ్మాయితో చెప్పాడట.



కానీ అనుకోకుండా వాళ్ళ తమ్ముడు చనిపోయోవడం తో అతను పల్లెటూరు కు వెళ్ళిపోయాడు. అలా వాళ్ళిద్దరూ విడిపోయారు తప్ప మరే ఇతర కారణాలు లేవని చెప్పారు.. దీంతో పుకారుకు బ్రేక్ పడింది. దివి తో పాటుగా చాలా మంది ప్రేమలు విఫలమయ్యాయి. మరి కొందరు మాత్రం ట్రాక్ లో ఉన్నారు. ఇటీవల జరిగిన షో లో అరియాన బయట పడింది.తనకు లవర్  ఉన్నాడని చెప్పుకొచ్చింది. అఖిల్ ది బయట బ్రేక్ అవ్వడంతో ఇప్పుడు మోనాల్ ను లైన్ లో పెట్టాడు. హారిక కూడా ఎవరు దొరికితే వాళ్ళను లైన్ లో పెట్టుకొంటూ వస్తుంది. ఏంటో బిగ్ బాస్ సీజన్ పూర్తి అయ్యేవరకు ఏమౌతుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: