పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్ లో హీరోగా మారిన యువ నటుడు విజయ్ దేవరకొండ ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా లో రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది. దాని అనంతరం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో విజయ్ నటించిన సినిమా అర్జున్ రెడ్డి. బోల్డ్ కంటెంట్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో తన ఆకట్టుకునే సహజత్వ నటనతో హీరో విజయ్ ప్రేక్షకులను, ముఖ్యంగా యువతను ఎంతో ఆకట్టుకున్నారు అనే చెప్పాలి. ఇక రిలీజ్ తరువాత ఈ సినిమా పెద్ద విజయాన్ని అందుకోవడంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు విజయ్.
ఆ తరువాత యువ దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో విజయ్ నటించిన సినిమా గీతా గోవిందం పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకోవడంతో విజయ్ కు స్టార్ హీరో స్టేటస్ లభించింది. ఇక అక్కడినుండి వరుసగా అవకాశాలతో కొనసాగుతున్న విజయ్ ప్రస్తుతం నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా ఫైటర్. డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం విజయ్ దేవరకొందా సిక్స్ ప్యాక్ చేయడంతో పాటు పలు యుద్ధ విద్యల్లో కూడా ఎంతో కఠినమైన శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని పూరి జగన్నాథ్, నటి ఛార్మి తో కలిసి నిర్మిస్తుండగా దీనికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ముంబైలో ప్రారంభం అయింది. ఇక లేటెస్ట్ గా కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో ఒక ముఖ్యమైన సర్ప్రైజింగ్ రోల్ లో సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ కనిపించనున్నట్లు టాక్.

ఇప్పటికే ఆ క్యారెక్టర్ కు సంబంధించి దర్శకడు పూరి ఆయనను కలిసి మాట్లాడినట్లు తెలుస్తోంది. సినిమాలో కొన్ని క్షణాలు కనిపించే పాత్ర అయినప్పటికీ కూడా దానికి ఎంతో ప్రాధాన్యం ఉండడంతో వెంకటేష్ కూడా చేయడానికి ఒప్పుకున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు. కాగా ఇటీవల పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల కాంబో లో తెరకెక్కిన అజ్ఞాతవాసి సినిమాలో వెంకటేష్ ఒక ప్రత్యేక పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే...!! 

మరింత సమాచారం తెలుసుకోండి: