ఈ ఏడాది ఆగస్ట్ లో చైతన్యతో నిహారిక నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ ఇద్దరూ డిసెంబర్ 9 న పెళ్లి చేసుకోబోతున్నారు. లాక్ డౌన్ ఎఫెక్ట్ వల్ల ఇటీవల టాలీవుడ్ లో జరిగిన కొంతమంది నటీనటుల వివాహాలు చాలా సింపుల్ గా ముగిశాయి. అయితే నిహారిక పెళ్లి మాత్రం అంగరంగ వైభవంగా జరగబోతోంద. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఓ ప్రముఖ ప్యాలెస్‌లో వీళ్ల పెళ్లి జరుగుతుంది. డిసెంబర్ 9 రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ముహూర్తం కుదిరింది.
పెళ్లి ఏర్పాట్లు ఘనంగా ఉన్నా.. అతిథుల విషయంలో మాత్రం ఆంక్షలు ఉన్నాయి. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అతి కొద్దిమంది బంధువులు మాత్రమే ఈ వేడుకకు హాజరవుతారని తెలుస్తోంది. ఇటీవలే గోవాలో తన ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చిన నిహారిక.. బెస్ట్ ఫ్రెండ్స్ అందర్నీ పెళ్లికి కూడా ఆహ్వానించింది. ఇక టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, దర్శక నిర్మాతలు ఎలాగూ పెళ్లికి వస్తారు. పెళ్లి వేడుకలో జబర్దస్త్ నటుల స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. నాగబాబుతో కలసి జబర్దస్త్ షో చేసినవారంతా.. ఈ వేడుకలో తమ స్కిట్స్ తో అతిథుల్ని అలరించబోతున్నారట.
మొత్తమ్మీద మెగా ఫ్యామిలీలో గతంలో ఎన్నడూ జరగని విధంగా.. భారీ ఎత్తున నిహారిక వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాతుర్మాస దీక్షలో ఉండటంతో.. నిహారిక ఎంగేజ్ మెంట్ కి రాలేకపోయిన పవన్ కల్యాణ్.. కనీసం పెళ్లికయినా వస్తారా అనే సందేహం ఉంది. ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు పవన్. డిసెంబర్ 9న ఆయన వీలు చూసుకుని పెళ్లి వేడుకకు వస్తారని అంటున్నారు. ఇదే వేడుకకు రేణుదేశాయ్, వారి పిల్లలు కూడా స్పెషల్ అట్రాక్షన్ అని తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి