మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఉన్న క్రేజ్ అంత ఇంత  కాదు. ఇప్పటికే ఈ హీరో అనేక సినిమాల్లో నటించి ప్రేక్షకులని ఫిదా చేసేసాడు. కరోనా వల్ల కొన్ని నెలలు షూటింగ్స్ ఆగిపోవడం....  కొన్ని మధ్య లోనే ఉండిపోవడం.... ఇటువంటివి అన్ని పూర్తి చేసుకుని సినిమా విడుదల చేయడం మామూలు విషయం కాదు. రామ్ చరణ్ అయితే ఓ వైపు ఆర్.ఆర్.ఆర్ .. మరో వైపు చిరు తో ఆచార్య ఈ రెండూ ఎంతో ప్రతిష్ఠాత్మకమైనవిగా చరణ్ భావిస్తున్నారు. ఈ రెండిటినీ కరోనా సమయంలో ప్రారంభించడంతో అనుకున్న విధంగా ఏదీ సాగడం లేదు. వీటి మూలం గానే  చెర్రీ డైలమాలో పడ్డాడు.

ఇది ఇలా ఉండగా ఆ రెండిటి తర్వాత ఏం చేయాలి? అన్న దానిపై ఏమి ఆలోచించడం లేదు. కానీ ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఆర్.ఆర్.ఆర్ దాంతో పాటే సెట్స్ కెళుతున్న ఆచార్య కోసమే పూర్తి స్థాయిలో ఆలోచించాల్సి ఉంది. ఆచార్యకు నిర్మాత గా పూర్తి న్యాయం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే షూట్ నెలల పాటు ఆలస్యం అయింది. బ్లాక్ బస్టర్ `ధృవ` సీక్వెల్లో ఒక సినిమా చెయ్యాలని చెర్రీ కి కసి ఉన్నప్పటికీ...... తని ఒరువన్ దర్శకుడు సీక్వెల్ పనుల్లో బిజీ అయిపోయాడు. అందుకే అక్కడే పూర్తి ఇంటరెస్ట్ పెట్టాలని భావించారు.  

సాటి హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కమిటవుతున్నా.... ఈ హీరో మాత్రం ఏదీ ఫైనల్ చేయడం లేదట. కథలు విన్నా  రిజెక్ట్ చేసి పంపారట.  ఇది ఇలా ఉండగా..... స్ట్రెయిట్ తెలుగు చిత్రం చేయాలనే ఆలోచన ఉంది కానీ...ఇప్పుడు ప్లాన్ మారిందట.  వరుసగా పాన్ ఇండియా సినిమాలకే ఆయన ప్లాన్ చేసేందుకు ఇంటరెస్ట్ చూపిస్తున్నాడట. అయితే ధృవ 2 ని పాన్ ఇండియా కేటగిరి లో చెయ్యాలనే ఆలోచనతో చరణ్ ఉన్నట్టు  గుసగుసలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: