జెర్సీ సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన శ్రద్ధ.. తన నటనతో ప్రేక్షకులను ఆకర్షించింది. సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో, ఆమెకు వరుస అవకాశాలు చాలానే వచ్చినట్లు తెలుస్తోంది. వరుస సినిమాలకు ఆమె ఇప్పటికీ ఓకే చెప్పినట్లు సమాచారం.
శ్రద్దా శ్రీనాథ్ చేయనున్న సినిమాల్లో ఒక బైలింగ్యువల్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ చిత్రం తమిళం, తెలుగులో రెండు భాషలలో చిత్రీకరించబోతున్నారు. ప్రమోద్ సుందర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఇందులో శ్రద్దా శ్రీనాథ్ ప్రధాన పాత్ర చేయనుంది. ఈ సినిమా చేయడానికి ఎంతో ఎగ్జైట్ అవుతోంది శ్రద్దా శ్రీనాథ్. ఎందుకంటే కథ అలాంటిది మరి.
ఈ సినిమాను ఆర్కే ఇంటర్నేషనల్ నిర్మించనుంది. ఈ సినిమా కథ రెగ్యులర్ సినిమాల్లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా... ఆలోచనాత్మకంగా ఉంటుందట. ఒకరకంగా ఈ సినిమా లో ఒక పాయింట్ ఆదిత్య 369 సినిమాను గుర్తు చేయనుందట. ఆ సినిమాలో ఫ్యూచర్ చూపించిన విధంగానే.... ఈ చిత్రం లో భవిష్యత్తు చూపించనున్నారట డైరెక్టర్. కాకపోతే ఆ సినిమాలో అది ఒక పాయింట్ మాత్రమే.... ఈ సినిమాలో ఫ్యూచర్ పూర్తి కథకు ఆధారం. ఈ సినిమా కథ 2050 టైమ్ పీరియడ్ లో సెట్ చేశారట దర్శకుడు ప్రమోద్. అంటే ఇప్పుడున్న టైమ్ పీరియడ్ కంటే 30 ఏళ్ల ముందు ఉంటుందన్నమాట ఈ సినిమా కథ. ఈ సినిమాకి కలియుగం అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. సినిమా కథ చెన్నైలో జరుగుతుందట.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి