పవన్ కళ్యాణ్ తన ‘జనసేన’ పార్టీ విషయాన్ని తాత్కాలికంగా మరిచిపోయి ‘గోపాలా గోపాలా’ లో బిజీగా ఉన్న పవర్ స్టార్ అభిమానులు మాత్రం పవన్ ‘జనసేన’ పార్టీ గురించి ఇంకా ఆలోచిస్తూనే ఉంటూ టెన్షన్ పడుతున్నారని వార్తలు వస్తున్నాయి.
ముందుగా ఎన్నికల బరిలోకి వస్తాడనుకున్న పవన్ తన రూట్ మార్చి జనసేన లక్ష్యం అధికారం కోసం కాదు ప్రశ్నించడానికే అని ట్విస్ట్ ఇచ్చినా పవన్ మాటపై గౌరవంతో, అప్పుడున్న పరిస్థితులను అర్థం చేసుకుని సైలెంటుగా ఉన్నారు ఫ్యాన్స్.
ఎన్నికలు ముగిసాయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు కూడ ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ‘జన సేన' పార్టీ గురించిన ఆలోచనలు మళ్లీ మొదలయ్యాయి. ఇప్పటికి కూడ ‘జనసేన' పార్టీకి సంబంధించి ఎన్నికల సంఘం నుండి గుర్తింపు రాకపోవడానికి కారణం ఏమిటి అని టెన్షన్ పడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
అంతే కాదు ఇప్పటి నుండే పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టక పోతే రానున్నగ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో ఎలా సత్తా చాట గలమని పవన్ వీరాభిమానుల టెన్షన్. ఇప్పటికే అటు మోడీ ఇటు బాబు ల ప్రభుత్వాల నిర్ణయాలపై ప్రజా వ్యతిరేకత మొదలు కావడంతో వీలైనంత తక్కువ కాలంలో జనసేనను ప్రజలకు దగ్గర చేయాలనీ పవన్ అభిమానుల కోరిక. కాని పవన్ లోతైయిన ఆలోచనలు ఏమిటో రానున్న రోజులలో తేలుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి