ఫ్యామిలీ నుండి ఒకరు
సినిమా ఇండస్ట్రీ కి వెళ్లారంటే మిగతా వాళ్లకు లైన్ క్లియర్ అయినట్టే లెక్క. వారి అండతో సినీ రంగ ప్రవేశం చేయవచ్చు. ఇప్పటికే ఇండస్ట్రీలో వారసుల హావ గురించి అందరికి తెలిసిందే. ఇక ఇదే దోవలో అక్కలు
సినిమా ఫీల్డ్ కి వస్తే చెల్లెళ్లకు కూడా రాచమార్గం దొరికినట్టే.
కాజల్ అగర్వాల్,
ఆర్తి అగర్వాల్, రాధికా ఇలా చాల మంది చెల్లెల్లు
సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. వీరి లాగానే
హీరోయిన్ జీవిత రాజశేఖర్ చెల్లెలు ఉమా కూడా
సినిమా ఫీల్డ్ కి వచ్చింది. జీవితకు మొదట్లో
తమిళ్ లో మంచి డిమాండ్ ఉండేది. ఆ తర్వాత తెలుగులో సైతం స్టార్
హీరోయిన్ గా నటించింది. తెలుగులో
జీవిత మొదటి
సినిమా తలంబ్రాలు. ఈ సినిమాలో
రాజశేఖర్ హీరో కం విలన్. ఆ తర్వాత రోజుల్లో సినిమాల్లో నటిస్తూ వీరిద్దరూ ప్రేమలో పడి
పెళ్లి చేసుకున్నారు.

ఇక అస్సలు విషయానికి వస్తే
జీవిత చెల్లెల్లు ఉమా సైతం తెలుగు సినిమాల్లో నటించింది. అంతే కాదు
జీవిత మొదటి చిత్రం అయినా తలంబ్రాలు సినిమాలో ఆమె ఒక ముఖ్యమైన పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మీకు ఆమె గురించి తెలియాలంటే తలంబ్రాలు
సినిమా యూట్యూబ్ లో ఉంది. కావాలంటే చూడండి. వాస్తవానికి ఉమా కి
సినిమా ఇండస్ట్రీ కి రావాలని కోరిక లేదట. కేవలం తన అక్క తో ఆటు షూటింగ్ చూడటానికి వచ్చిందట. ఉమా చాల చలాకీగా ఉండే అమ్మాయి. సెట్లో ఆమె హుషారు అందం చూసి తలంబ్రాలు
సినిమా తీసిన శ్యామ్‌ప్రసాద్
రెడ్డి ఆమెను ఎలాగైనా సినిమాలో నటించాలని అడిగాడట. మొదట జీవితం అందుకు ఒప్పుకోలేదట., కారణం ఉమా కి అస్సలు డైలాగ్స్ చెప్పడం రాదు, కెమెరాను సరిగ్గా చూడటం చేతనయ్యే పని కాదు, నటన తెలియదని జీవితం చెప్పిన వినకుండా మొత్తానికి సినిమాలో పెట్టుకున్నారట.

ఉమకి డైలాగ్స్ చెప్పడం రాకపోవడంతో రెండు రోజులు షూటింగ్ ఆపి మరి ఉమకి నటనలో ట్రైనింగ్ ఇచ్చి, అన్ని వైడ్ షాట్స్ తో
సినిమా పూర్తి చేసారు. మొత్తానికి
సినిమా భారీ హిట్ అయ్యింది. ఆ తర్వాత కొన్ని అవకాశాలు వచ్చిన అవి సరిగ్గా ఆడలేదు. కానీ
జీవిత ఉమా ఎక్కడ కనబడ్డ నీకన్నా మీ చెల్లి అందంగా ఉంది అంటూ చెప్పేవారట. ఇక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఒక
బిజినెస్ మ్యాన్ ని
పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది ఉమా.