అయితే మోనాల్ నవ్వతూ అఖిల్‌ను పులిహోర కలపడం తగ్గించుకో అని సలహా ఇచ్చింది. దీంతో అఖిల్ సీరియస్ అయ్యాడు. ఒకమ్మాయిని ఫ్రెండ్‌గా తీసుకుంటే తప్పేమీ కాదని అఖిల్ అన్నాడు. ఆ తర్వాత పులిహోర అంటూ సోహైల్ సైతం అఖిల్ పై పాటలు పాడాడు. నేనేదో చేసేస్తున్నా అన్నట్లుగా మాట్లాడుతున్నావని మోనాల్ మీద అఖిల్ ఫైర్ అయ్యాడు. దీంతో మోనాల్ నీవు మొదటి నుంచి ఫ్లర్టింగ్ చేస్తున్నావు. కానీ, ఈ మధ్య కొంచెం ఎక్కువైందని అంది.
ఇక అది చూడటానికి బాగోలేదు అని ఉన్నమాట చెప్పింది. నిన్ను ఏదో బ్యాడ్ చేయడానికి ఇలా చెప్పట్లేదని స్పష్టం చేసింది. కానీ అఖిల్ మాత్రం ఆమె మాటలతో ఏకీభవించలేదు. ‘నేను అందరి ముందే మజాక్ చేస్తున్నాను అంతే, నీకు తప్పుగా అనిపిస్తే నాకు చెప్పకు, నాతో మాట్లాడకు’ అని దురుసుగా మాట్లాడటంతో మోనాల్ హర్టై అక్కడ నుంచి వెళ్లిపోయింది. నీతో టైమ్ స్పెండ్ చేయాలని ఉందని మోనాల్ మనసులోని మాటను బయట పెట్టింది. అలా అనిపిస్తే ఎక్కడో మూలన ఎందుకు కూర్చుంటావు, నువ్వే వచ్చి నా పక్కన కూర్చో అని పట్టింపు లేనట్లుగా మాట్లాడాడు. దీంతో అఖిల్ అన్న మాటలకు మోనాల్ బాధపడింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి