పరశురాం ఈ సినిమాకు కథ సిద్ధం చేశాడట. అతని అసిస్టెంట్ డైరక్టర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. అయితే ఈ సీక్వల్ లో విజయ్ దేవరకొండ, రష్మిక నటిస్తారా లేక మరెవరైనా హీరో చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. గీతా గోవిందం 2 అది కూడా విజయ్ దేవరకొండ, రష్మిక చేస్తే మాత్రం తప్పకుండా సినిమా రేంజ్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.
గీతా గోవిందం 2 వస్తే మాత్రం తప్పకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం స్టార్ సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ మాత్రం గీతా గోవిందం 2 అంటే మాత్రం చేసే ఛాన్స్ లేదని అనిపిస్తుంది. మరి గీతా గోవిందం సీక్వల్ గా వస్తున్న వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉంది. ఈ సినిమా విజయ్, రష్మిక కాకుండా వేరే ఎవరు చేస్తారన్నది చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి