తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారం చేసుకుని ఈ చిత్రం తెరకెక్కడం విశేషం. రవితేజ సినీ జీవితంలో రానున్న అరవై ఆరవ చిత్రం క్రాక్. ఈ సినిమాలో రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. మరో విక్రమార్కుడిలా.... ఈ సినిమాలో రవితేజ అదరగొడతాడని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకి సంగీతం సమకూర్చగా.. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. జనవరి 1న మూవీ ట్రైలర్ ను దర్శక నిర్మాతలు గోపీచంద్, మధు విడుదల చేయబోతున్నారు.
సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు యమ ఫాస్ట్ గా సాగుతున్నాయి. మంగళవారం ఈ సినిమా డబ్బింగ్ పనులను రవితేజ మొదలుపెట్టారు. ఈ చిత్రంతో ఎలాగైనా సాలిడ్ హిట్ ను తన అకౌంట్లో వేసుకోవాలని కసిగా ఉన్నాడు హీరో రవితేజ. ఈ సినిమా ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని తన అభిప్రాయాన్ని తెలియజేశారు. అటు చిత్ర బృందం కూడా ఇదే భావాన్ని వ్యక్తం చేస్తోంది. సంక్రాంతి పండుగ బహుమతిగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి... ప్రేక్షకులు ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వనున్నారో వేచి చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి