సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా మహర్షి. మహేష్ బాబు ఈ సినిమాలో రిషి అనే యువకుడిగా మూడు రకాల విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో ఎంతో అత్యద్భుతంగా నటించారు. మరొక నటుడు అల్లరి నరేష్ మహేష్ కి స్నేహితుడిగా నటించిన ఈ సినిమా రిలీజ్ అనంతరం సూపర్ డూపర్ హిట్ కొట్టింది. వంశీ పైడిపల్లి తీసిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా థమన్ మ్యూజిక్ అందించాడు. ఇకపోతే దాని తరువాత మరొక్కసారి మహేష్ తో వంశీ ఒక సినిమా తీయనున్నారు అంటూ అప్పట్లో వార్తలు వచ్చినప్పటికీ ఆ సినిమా కథ యొక్క పూర్తి స్క్రిప్ట్ సిద్ధం కాకపోవడంతో తన నెక్స్ట్ సినిమా ఛాన్స్ ని పరశురామ్ కి ఇచ్చారు మహేష్.
ఇక అతి త్వరలో పరశురామ్ తో సర్కారు వారి పాట సినిమా చేయనున్న మహేష్, దాని అనంతరం మాత్రం పక్కాగా వంశీతోనే వర్క్ చేయనున్నారని, వారిద్దరి సినిమాకి స్టేట్ రౌడీ అనే టైటిల్ నిర్ణయించారని మళ్ళి వార్తలు ఊపందుకున్నాయి. అయితే వీటిపై మాత్రం ఇప్పటి వరకు అటు మహేష్ నుండి కానీ, ఇటు వంశీ నుండి కానీ ఎటువంటి స్పందన రాలేదు. ఇక లేటెస్ట్ గా రెండు రోజుల నుండి మరొక వార్త విస్తృతంగా ప్రచారం అవుతోంది.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ తో పాటు ఆచార్య మూవీ కూడా చేస్తున్న చరణ్ కోసం ఒక పవర్ఫుల్ స్టోరీ ని సిద్ధం చేసిన వంశీ పైడిపల్లి రెండు రోజుల క్రితం ఆయనకు స్టోరీ ని వినిపించారని, అది ఎంతో నచ్చిన చరణ్, పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయండి వీలైనంత త్వరగా సినిమా మొదలెట్టేద్దాం అని మాట కూడా ఇచ్చారట. దీనిపి ప్రకారం వంశీ ఫోకస్ మహేష్ నుండి చరణ్ మీదకు షిఫ్ట్ అయిందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: