టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత ఎప్పుడూ ఉంటున్నదే.. ఒక సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకునే భామలు కొందరైతే.. ఐదారు సినిమాలతో స్టార్ ఇమేజ్ తెచ్చుకునే వారు కొందరు ఉన్నారు. అయితే కొందరు మాత్రం సినిమాలైతే చేస్తారు కాని స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడంలో వెనకపడతారు. అయితే ఈమధ్య కాలంలో తెలుగు తెర మీద కొత్త అందాలు చూస్తూనే ఉన్నాం. ఇక రీసెంట్ గా సంక్రాంతికి రిలీజైన రెడ్ సినిమాలో అమృత అయ్యర్ సర్ ప్రైజ్ చేసింది.

అసలైతే అమ్మడు చేసిన మొదటి సినిమా యాంకర్ ప్రదీప్ హీరోగా వచ్చిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? ఈ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో ముందు రెడ్ సినిమా రిలీజైంది. రెడ్ లో గాయత్రి పాత్రలో అమృత అయ్యర్ నటన మెప్పించింది. తనకు ఇచ్చిన పాత్రలో ఎంతో రిజర్వెడ్ గా చూడగానే ఇంప్రెస్ అయ్యేలా అమృత అయ్యర్ పాత్ర ఉంది. రెడ్ సినిమాలో చెప్పుకోడానికి ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా మాళవిక శర్మ తో గ్లామర్, నివేదా పేతురాజ్ తో సీరియస్, అమృత అయ్యర్ తో కాం గోయింగ్ గాళ్ లా మూడు పాత్రలని డిఫరెంట్ గా డీల్ చేశాడు డైరక్టర్ కిశోర్ తిరుమల.

అయితే ముగ్గురిలో నివేదా పోలీస్ పాత్రతో పాటుగా అమృత అయ్యర్ గాయత్రి పాత్ర మెప్పించింది. సినిమాలో ఉన్నది తక్కువ పాత్రే అయినా ఆ ఉన్న కాసేపు అమ్మడు తన టాలెంట్ తో మెప్పించింది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో ప్రదీప్ తో పాటుగా అమృత అయ్యర్ కూడా ప్లస్ అవబోతుందని ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తేనే తెలుస్తుంది. మరి అమ్మడు లీడ్ రోల్ లో నటించిన ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. రెడ్ సంక్రాంతికి రాగా ప్రదీప్ సినిమా ఈ నెల చివరన రిలీజ్ అవుతుంది. ఒకే నెలలో రెండు సినిమాలతో అమృత అయ్యర్ సత్తా చాటుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: