ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. విజయ్ దేవరకొండని ఫైటర్ గా చూపిస్తూ పక్కా మాస్ హిట్ కోసం చూస్తున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఇప్పుడు డిఫరెంట్ టైటిల్ తో ఆకట్టుకున్నాడు. విజయ్ దేవరకొండకి పక్కా సరిపడే టైటిల్ ని పెట్టి తన మార్క్ ని చూపించాడు. లైగర్ అంటూ రిలీజ్ అయిన ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. ఫస్ట్ నుంచి ఫైటర్ అనే టైటిల్ అనుకున్నా, లైగర్ అనే టైటిల్ కూడా వినిపించింద. సింబాలిక్ గా చూస్తే సగం ముఖం సింహం, సగం ముఖం పులి ఫోటోలని కూడా బ్యాక్ గ్రౌండ్ లో పెట్టి ఆకట్టుకున్నాడు...అంతేకాదు, సాలా… క్రాస్ బ్రీడ్ అంటూ ట్యాగ్ లైన్ ని కూడా పెట్టి ఈ సినిమా ఎలా ఉండబోతోందో కూడా ముందుగానే చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.

లైగర్ అంటే ఇది ఒక ‘జూ’ లో ఉండే హైబ్రీడ్ అంట. ‘టైజాన్’ అంటే మేల్ టైగర్ కి, ఫిమేల్ లైన్ కి పుట్టిన పిల్ల అని అర్ధం అని, ‘లైగర్’ అంటే మగ సింహం, ఆడ పులికి పుట్టిన పిల్ల అని అర్ధం అని చెప్తున్నారు. అందుకే, ఈ టైటిల్ ని వెరైటీగా పెట్టారని, దీనివల్ల అందరి అటెన్షన్ ని గ్రాబ్ చేశారని అంటోంది మూవీ టీమ్.

ఇక పూరీ జగన్ స్టైల్ లో హీరోయిజం సినిమాలో కనిపించడం అనేది పక్కాగానే కనిపిస్తోంది.లాస్ట్ టైమ్ పూరీ జగన్నాథ్ బాక్సింగ్ నేపథ్యంలో తీసిన అమ్మ నాన్న తమిళమ్మాయి సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మరి విజయ్ దేవరకొండతో ఎలాంటి మాయ చేయబోతున్నాడు. ఎలాంటి మాస్ డైలాగ్స్ చెప్పించబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది.

ఎందుకంటే, పక్కా మాస్ డైలాగ్స్ రాయడంలో పూరీ జగన్నాథ్ దిట్ట. అలాగే, డైలాగ్స్ వెండితెరపై పలికించడంలో దేవరకొండ మేటి. మరి వీరిద్దరి ఈ కాంబినేషన్ లో ఎలా ఉండబోతోందో అని ఫ్యాన్స్ చాలా ఆత్రుతగా  వెయిట్ చేస్తున్నారు. కాని సాధారణ ఆడియన్స్ అయితే ఒక రేంజిలో ట్రోల్ చేస్తున్నారు.. విజయ్ ని నవ్వుల పాలు చేస్తున్నారు. ఇక ఈ ట్రోల్ల్స్ పై విజయ్ ఎలా స్పందిస్తాడో చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: