ఈ మధ్య కాలం లో బుల్లితెర షో  క్రేజీ ఎంత పెరిగి పోతుందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు అనే విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఎన్నో కొత్త షోలు  తెర మీదికి వస్తున్నాయి... బుల్లితెర ప్రేక్షకులందరికీ ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ పంచుతున్నాయి  అన్న విషయం తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు సరికొత్త కాన్సెప్ట్ తో కూడిన బుల్లితెర షోలు  తెరమీదికి వస్తూ ప్రేక్షకులందరినీ అలరిస్తున్నాయి. ఈ క్రమంలోనే  మాటీవీలో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ అనే కొత్త షో  ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే.


 సరికొత్త కాన్సెప్ట్ తో తెరమీదికి వచ్చిన ఈ షో ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షిస్తూ మంచి రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్గా కొనసాగుతున్న సుమ యాంకర్, రవి కలిసి ప్రస్తుతం ఈ షో  హోస్టింగ్ చేస్తూ ఉండడం.. అంతే కాకుండా ఎంతో అదిరిపోయే ఆశ్చర్యకరమైన టాలెంట్ ఉన్నవాళ్ళతో పర్ఫామెన్స్ చేయిస్తూ ఉండటం తో ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తుంది ఈ షో.. ఇక ప్రతి ఎపిసోడ్ లో కూడా కొత్త సెలబ్రెటీలు ఎంట్రీ ఇచ్చి సందడి చేస్తున్నారు.



 ఇకపోతే ఇటీవల విడుదలైన బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఈ షో లో గెస్ట్ గా ప్రస్తుతం బుల్లితెరపై  ధారావాహికలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న పవన్, తనుజ వచ్చారు. అయితే ఇటీవలే విడుదలైన ప్రోమోలో  సువ్వి సువ్వి సువ్వాలమ్మ అనే పాటను యాంకర్ సుమ, రవి కలిసి పాడి బుల్లితెరప్రేక్షకులను  షాక్ కి గురి చేశారు. ఎంతో అద్భుతంగా పాడిన ఈ  ఇద్దరూ.. వీరిలో ఈ కొత్త టాలెంట్ కూడా ఉందా అని అందరినీ షాక్ కి గురి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: