ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  ఏ ఆర్ రెహమాన్ పాట  వస్తుందంటే చాలు పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఉర్రూతలూగి పోతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక తన పాటలతో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు ఏఆర్ రెహమాన్. ఎలాంటి  పాటలను అయినాసరే తనదైన శైలిలో సంగీతం అందించి అటు  సంగీత ప్రేమికులు అందరిని ఎప్పుడు ఉర్రూతలూగిస్తూ ఉంటారు అన్నది  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.



 ఇప్పటికే ఏఆర్ రెహమాన్ అందించిన ఆల్బమ్స్ అన్నీ కూడా భారీ రేంజ్ లో ప్రేక్షకాదరణను సొంతం చేసుకొని పాపులర్ అయ్యాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎన్నో వైవిధ్యమైన పాటలకు  కేరాఫ్ అడ్రస్ గా ప్రస్తుతం ఏ.ఆర్.రెహమాన్ సంగీతం ఉంది అని చెప్పాలి. ప్రస్తుతం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఉన్న సంగీత దర్శకులలో ఎంతో ప్రతిభావంతుడు గా గుర్తింపు తెచ్చుకున్న ఎ.ఆర్.రెహమాన్ ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఎంతో ప్రతిభావంతులైన గాయకులను వెలుగులోకి తీసుకు వచ్చేందుకు దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ నిర్ణయించుకున్నాడు.


 ఈ క్రమంలోనే ఫ్యూచర్ ప్రూఫ్ అనే పేరుతో సరికొత్త కార్యక్రమానికి ఇటీవలే సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.  మన దేశంలో ఉన్న సృజనాత్మకతను కళాత్మక ఆలోచనలను కూడా ఎంతో ప్రోత్సహించాల్సిన  అవసరం ఉంది అనే ఆలోచనతోనే ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను  అంటూ ఏ.ఆర్.రెహమాన్ చెప్పుకొచ్చారు. అంతర్జాతీయ వేదికపై భారత ప్రతిభావంతులను నిలబెట్టడమే కార్యక్రమం యొక్క లక్ష్యం అంటూ చెప్పుకొచ్చారు ఏ ఆర్ రెహమాన్. ఎంతోమంది ప్రతిభ ఉన్నప్పటికీ వెలుగు లోకి వచ్చేందుకు సరైన ప్రోత్సాహం లేని వారికి ఇది ఒక సదవకాశం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: