కెమెరా మేన్ గంగ... అదేనండీ, తమన్నా.... కాస్త అసంత్రుప్తిగా ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ‘కె.గ.రా.బు’ సినిమా ప్రమోషన్స్ ప్రణాళిక అమాంతంగా తల్లకిందులైపోవడమే అందుకు కారణం అంటున్నారు. అయితే, కొత్త హీరోయిన్ లా తమన్నా ప్రమోషన్స్ ని ఎందుకంత సీరియస్ గా తీసుకుందీ... దీనికి బలమైన కారణమే ఉంది. ‘కె.గ.రా.బు’ సినిమా రిలీజ్ అయ్యాక రకరకాల రివ్యూలు వచ్చాయి. కానీ, వాటిల్లో 80 శాతంకి పైగా ‘ఈ చిత్రంలో తమన్నాకి ప్రాధాన్యం అంతంత మాత్రమే... పైగా ఆమె అమ్మాయిలా కనిపించనేలేదు. టామ్ బాయ్ లా ఉందీ’ అంటూ విశ్లేషణలు వచ్చాయి. దీంతో కాస్త హర్ట్ అయినట్టుంది తమన్నా. అందుకే, ‘ఈ సినిమాలో నా క్యారెక్టర్ సూపర్. ఎంతో కష్టపడి నటించాను’ అని ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెబుదాం అనుకుంది. కానీ, అనుకున్నదొక్కటి... అయ్యింది మరొక్కటీ. మొన్న ‘రెబల్’ ఫ్లాప్... ఇవాళ్ల పూరీ చిత్రంలో ప్రాధాన్యత లేని పాత్ర... ఇలా అయితే భవిష్యత్తు ఏమౌతుందో తన క్రేజ్ కరిగిపోతుందేమోనని కాస్త టెన్షన్ పడుతోందట.  

మరింత సమాచారం తెలుసుకోండి: